పుట:2015.333901.Kridabhimanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోని గుహాలయమును దొరతనమువారు కనుగొని పరిశీలించి యక్కడి శిల్పచతురాలదులను గూర్చి ప్రశంస నెఱపినారు. ఈగ్రంధరచనమునాటి కాగుహాలయమున వర్ణచిత్రములుగూడ నుండెనేమో? మోహనశైల మని,సువర్ణకందర యని కలదుగదా !

                        ఇది శ్రీనాధకృతమే

వల్లభిరాయనికృతిగా గ్రంధమున నున్నను, శ్రీనాధుదే వీనిని రచించెనని పెక్కుకారణములచే నేను నిశ్చయించుచున్నాడను. ఇంతకుముం దాకారణంఊళ జాలంగా నేను 'శృంగార శ్రీనాధము 'న *జెప్పియుంటిని. అయినను నిక్కడ మరల మఱింత ప్రబలముగా జెప్పుచున్నాడను. సులక్షణ సారము, అప్పకవీయము, లక్షణదీపిక, సర్వలక్షణసార సంగ్రహము మొదలగు లక్షణగ్రంధములందు శ్రీనధుని వీధినాటకములోనివిగా నుదాహృతము అయినపద్యము లీ క్రీడాభిరామమున గలవు. శ్రీనాధుదే యీ గంధమును రచించి వల్లభరాయనిపేరు పెట్టగా గ్రంధమున వేఱు పేదున్నను, రంగనాధరామాయణాదులవలె నీగ్రంధము కూడ గర్త యగు శ్రీనాధునిపేరనే లోకమున ప్రచారము


  • 1923 లో ప్రకటితము