పుట:2015.333901.Kridabhimanamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నింద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు
కమనీయతర దేహకాంతివాని
నుడు రాజరుచులతో నొఱవచ్చు ననవచ్చు
చంచన్మదాట్టహాసమ్లవాని
సిగ్గుమాలిన మొలవాని జిఱుతవాని
నెల్లకాలంబు ములికినా డేలువాని
నర్థి మోపూర నవతార మైనవాని
భైరవుని గొల్వవచ్చిరి భక్తవరులు (ప్రబంధ 131 పుట)
ముల్కినాటిలోని భైరవస్వామియనుగ్రహ మీ
యుపలబ్ధగ్రంధభాగమున గూడ రెండుచోట్ల స్మరింపబడినది. 'ప్రత్యక్ష మొనరించి భైరవస్వామిచే సిద్ధ సారసత శ్రీ నహించే ' (22 ప) నని యువతరణికలోను
చ."ముదమున ముల్కినాటిపుర మోహనశైల సువర్ణకందరా
     సదనుడు గాలభైరవుడు శంభునిపట్టి సమవైభా
     భుద్యయ పరంపరా విభవముల్ గృపసేయు గవీంద్రకాంక్షిత\
     త్రిదశ మహీరుహంబునకు దిప్పయవల్లభరాయ మంత్రికిన్."
                                                           (క్రీడా. 294 ప)
అని కృత్యంతమునను గలదు. గ్రంధమధ్యమున గూడ గాలభైరవవర్ణనము గలదు. కృత్యంతపద్యమున భైరవుడు 'ముల్కినాటిపురమోహనశైలసువర్ణకందరాసదనుడని వర్ణితుడయ్యగదా! ఇప్పుడా భైరవునికొండ