పుట:2015.333901.Kridabhimanamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంచి యుండుటచే నప్పకవ్యాదులట్లు చెప్పియుండవలెను. అప్పకవ్యాదులుదాహరించిన పద్యములు క్రీడాభిరామమున నానుపూర్వితో నున్నవి. ప్రక్షిప్తములన గుదురదు. వల్లభరాయుడును శ్రీనాధుడును సమకాలమూఅవారు గాకపోదురేని, శ్రీనాధు డాతని పేర గ్రంధము రచించుట యసంభవమగు;ను. అట్టి చిక్కులేదు. శ్రీనాధుడును వల్లభరాయుడును సమకాలమువారు. వల్లభరాయని పెద్దతండ్రియగు లింగన మంత్రి విద్యానగరపుహరిహరరాయల మంత్రి. రెండవ మూడవ హ్రిహరరాయండ్రు కీ.శ.1402-1412 వఱకు నుండిరి. లింగనమంత్రి వారిలో నెవరియొద్ద మంత్రియయియుండినను వల్లభరాయుడు మన శ్రీనాధుని సమకాలము వాడే యగును. అందును నీ క్రీడాభిరామమును కాశీఈఖండరచ్నానంతరమే రచించెనని నేదలంచుచున్నాడను కాశీఖండ రచనానంతరమే రచించెనని నె దలంచుచున్నాడను గాన శ్రీనాధుడును వల్లభరాయుడును సమకాలమువారగుదురనుటను సంశయింప బనిలేదు.

మఱియు నీ గ్రంధమున వల్లభరాయని వాగ్వైభవ దాతృత్వాదివర్ణనము మితిమీఱి యున్నది. గంధకర్తయే తా నగుచో వల్లభరాయ డ ట్లాకందపద్యాష్టకమును రచించుకొని యుండడు. ఆ పద్యములు భీమఖండాదులలోని కృత్యవతరణికాపద్యమ్ల (భీమ 1-236' 71) పోలిక గలిగియున్నవి. అందు గడపటిపద్యము