పుట:2015.333901.Kridabhimanamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ననుట కాధారముగా వెల్లడించిన *దశకుమారదరిత్రపద్యముల నేనప్పుడు చూడలేదు. వాని వెల్లడించినందుకు శ్రీ శాస్త్రులవారియెడ గృతజ్నుడను.


  • క.చరణములు నేత్రములు గడు

     నరుణము లారెలును ముక్కు నాయతములు కం
     ధరములు దొడలును సన్నము
     లరయగ బకజాతి కది భయంపడు బోరన్.
క. ఆరెలు వలములు దొడలును
    ధోరము బలుమెడయ జుట్టు దుండము గుఱుదర్
    బీరంబును సురమును వి
    స్తారి యగు న్నారికేళజాతికి నెందున్.
క.ఆ నారికేళజాతికి
   మానుగ బకజాతి సోర మార్కొన దగుడుం
   దా నట యదుకలి యనుచును
   మానక పోరించు నదితమాత్సర్యమునన్.
సీ. ఎదిరినకోడి ము న్నెనని యాదెలు మెడ
            వెన గాడ మరువడి వ్రేసి వ్రేస్
   యది వ్రేయ మది కిన్క నడరి జబ్బున బట్టి
         కబళించి యందంద కదిమి కరిమి
   విశిఖముఖంబులు వెనువెంట దగులును
        నంతంత బోనీక యాగి యాగి
   వాగాటలకు వచ్చి వసుమతి నిలువక
         యెంటితన్నున గొన రుడిని యడిసి
తే. గెలిచె నామాట! దగ నరికేళజాతి
    యగ్గలిక నంత ప్రజ యెల్ల నార్పుచుండె
   జెలగి యొకజాతిమారోనజీవి యైన
   బ్రాహ్మణుండు న న్నెంతయు బ్రస్తుతించి.
                      దశకుమార చరిత్రము. నవమాశ్వాసము. 30-38