పుట:2015.333901.Kridabhimanamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆముక్తమాల్యదపీఠిక 51 వ పుటలో శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రులవా రీ ప్రయోగమునుగూడ జూచి యిట్లు వ్రాసిరి. 'తేడు అనగా వెదకుట అని యరమున బ్రసిద్ధము ఆయర్ధమున శ.ర. లేదు."

  తేడుకు 'వెదకు ' అర్ధము స్పష్ట మగుచుండగా దదనుసారిగా క్రీడాభిరామపద్యమునకు నేజెప్పిన  యర్ధము "ఏమాత్రము సందర్భోచితముగా లేదు".  "సమంజసముగా లేదు" -అట! ఏలో?
   ఆ బ్రాహమణు డోరుగంటికి వేడుకలమీద వేడుకలు దిలకించుటకు, విహరించుటకు వచ్చినాడు గాని యారగించి నిద్రించుటకు గాదు.  దిట్టముగా దింది దిని తాంబూలచర్వణము సేయును వేడుకపట్టులు వెదకబోవు చున్నా డనునర్ద మేల సమంజసముగాదు?
                    నారికేళబకజాతీయములు
       కేయూరబాహుచరిత్రమున నారికేళజకమను కొక్కెర, అది కొబ్బరిచెట్టుపై వసించునదే యగుట కలదు గాన దాని బట్టి నారికేళబకజాతీయములు అన్నపదమునకు నారికేళముపై వసించు బకములతె4ఎరు గలవి అన్నయర్ధమును 'కాబోలును ' అని సందేహముతోనే నేను వెల్లడించితిని.  శ్రీశాస్త్రులుగారు కోళ్ళు నారికేళజాతివి, బకజాతివి కల