పుట:2015.333901.Kridabhimanamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దిత్తి యొకటి గొని త్రేణి మ
ఱుత్తర ముత్తర మటంచు నొక ప్రొద్దుకడన్.

   శ్రీ వేంకటరాయశాస్త్రులవా రీ పాఠమునే గ్రహించిరి, మఱియు వ్యాఖ్యలో నిట్లు వ్రాసిరి.
       "తేండి-దొరికిన వ్రాతపతు లన్నింటను 'త్రేణి 'అని యున్నది. 'త్రేణి ' అని తెండి (=శయనించి) అనుటకు ఈ వ్రాతపుస్తకములలో తఱచుగ గలదు. 'తేడు ' ధాతువు 'తెండు ' ధాతువునకు రూపాంతరముగా శ.ర.లోనున్నది కొన్ని దేశ్యశబ్దములందు తొలియక్కరమునందలి క్రారవడులు అంతరించుట ప్రసిద్ధమే. డకారముతావున ణకారము నిలుచుటయు సిద్ధమే.
  ఉదాహరణము. అణగు అడగు పోణిమి పోడిమి ఇత్యాదులు. కావున నిట కవి ప్రయోగించిన పదము 'శ్రేణి ' అని యుండునని యూహింపబడినది.  ఆ వ్రాతపుస్తకములలో టీకయుంగలదు. అందు 'శ్రేణిమఱి '  'నిద్రమేల్కాంచి ' అని యర్ధమును వ్రాయబడినది."
  'తేడు ' కు వెదకు అర్ధమును నిరాక్షేపముగా నిరూపించుప్రయోగ మిది యొక?టి గలదు.

క. జాదంబు లన్నిదంబును
    వాదుమ బతితోడ దేడ వలవరు కడు బో
    రా దయ్య నేని భృత్యులు
    భేదము గాకుండుగెలుపు పెనుపగ వలయున్
                       (భోజరాజీయము.)