పుట:2015.333901.Kridabhimanamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పండితులు ఇందు 'తాకట్టు పెట్టి ' అని యర్ధమువ్రాసిరి. తేవప్పెరుమాళ్లయ్యగారు వ్రాతప్రతులను బ్రౌనుదొరగారు వ్రాయించినటీకను బరిశీలించి 'అహికము ' తాకట్టు అనునర్ధముతొ బరకటించిరి (చూ. 194 పుట) పిదప శ్రీ వేంకటరాయశస్త్రులుగారు మరల నాగ్రంధమును బ్రకటించుటలో అహికము శబ్దరత్నాకరాదినిఘంటూద్దృతము గాకుండుటచే గాబోలును 'అహితము ' అని దిద్దిరి (చూ.151 పుట). తాకట్టు అనియే యర్ధము వ్రాసిరి. ఆపాఠము వ్రాతప్రతులలో లేదు. తెలుగున 'అయకము ' అను పదము తాకట్టు అనునర్ధమున వ్యవహారమున గలదు. ఆయకము రూపాంతరము 'ఆహకము ' అని యుండునని గాబోలును బ్రౌను, సీతారామాచార్యులు తమ నిఘంటువులలో గౌరవప్రయోగమును 'అహకము ' గా గ్రహించిరి. వ్రాతప్రతులలో లెని 'అహకము ' రూపము గ్రాహ్యము కాదు. గౌరవ నవనాధచరిత్రమున గూడ 'అహికము '--కలదు. 'అహికంబులు వెట్టి యప్పులు వార, వృద్ధి కొసంగుదు ' (చూ. 153 పుట). అహి, ఆహికము రూపభేదములు కాబోలును. ఆహిపదప్రయోగము ఇంత సధక సామగ్రి కలది. శ్రీనాధప్రయుక్తమున శ్రీనధరచనముల వారగించి, జీర్ణించుకొని కవితాబలము గడించినవాడు