పుట:2015.333901.Kridabhimanamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూలమున గూడ నిట్లే యున్నది. కాని 'ఆహివెట్టు ' అనుపదమే యెక్కడను గాన్పింపదు. కావున నిట "అధివెట్టు ' అని యుండవలయును. అధిశబ్దమునకు దాకట్టు అనువర్ణము గలదు.

           ఈ క్రింది ప్రయోగములోగూడ 'అధివెట్టు ' పదము గలదు.

'గ్రహణసంక్రమణాదుల రాచనగర
 గానువీసంబు వెడలమి గ్రాసమునకు
 వాధివెట్టిరి క్షేత్రంబులందు గొన్ని
 లెస్స యుండునె గృహభర్త లేనిబ్రదుకు '
                                (మనుచరిత్ర - 3-34)

      దీనికి నె జెప్పుసమాధాన మిది.
   నిఘంటువులలో ఏకమాత్ర ప్రయోగముతో ఎన్నో పదములు పరిగృహీతము లయినవి.
   వ్రాతప్రతిలో నున్న "అహివెట్టు" ప్రయోగము సరికా దన్నయపనమ్మకము నాకు లేదు. కాన దానిని వేదిద్దలేదు.  'అధి ' పద మొకటి 'తాకట్టు ' అర్ధము గలది ఉన్నంతమాత్రాన 'అహి ' ఉండ దనవచ్చునా?
  గౌరవ హరిశ్చంద్రోపాఖ్యానమున ఎల్లవ్రాతప్రతులలో 'అహికంబులు వెట్టి ' అన్న ప్రయోగము గానవచ్చుచున్నది.  'అహికంబులు వెట్టి యని దక్కుమితులు సాహసంబున బల్కి ' (చూ - ఉత్తరభాగము). బ్రౌనుదొరగారి