పుట:2015.333901.Kridabhimanamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవితావిమర్శము

        శ్రీనాధు డాంధ్రపద్యముల కబ్రపునిబ్బరపునడక నేర్చినాడు.  శయ్యాసౌభాగ్య మాతనిరచనలలో సర్వత్ర యతిమాత్రమై సాగును.  నన్నయ, నాచనసోమున తొలుత నిట్టిత్రోవద్రొక్కిరి.  శ్రీనాధుడు దని ఘంటాపధము గానించెను.  అన్నియర్హతలకంటె నధికముగా శయ్యాగౌభాగ్యమునే శ్రీనాధుడు చక్క జూచుకొనును.  ఈ క్రింది పద్యము జదువుడు.

శా. ఆకాశాంచలవీధుల న్నిగిదె సంధ్యారాగరేఖ వళుల్
    పాకోనిద్రిత పారిభద్ర పటలీ పాండిత్య వైతండికో
    త్సేక స్పూర్జిత చండ తాండవ రయో ద్రేకారభట్యుద్భట
    శ్రీకంఠ స్థిరక్జంఠ కోమల జతాశ్రేణి న్విడంబించుదున్.
                                            (భీమ. 2.32)

          శయ్యలిగింపేకాని యిం దర్ధంపుసొం పేమున్నది? ఆకాశాంచలవీధులందు సంధ్యారాగరేఖలు సాగినట్లే యీ పద్యము ప్రధమచరణమున బదరేచన సాగినది.  తక్కిన చరణములును దానికి దగినట్లు నెగడినవి.  కొన్నిచోట్ల నిట్లున్నను నెన్నోచోట్ల శ్రీనాధుడు శ్రవణమాత్రముననే సంతోషము గొల్పజాలు గదుసరినుడికారములను సంస్కృతాంధ్రములలో జతపపఱిచి సరసార్ధముతో జతురరచనలల నెఱపెను.