పుట:2015.333901.Kridabhimanamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనకధాపాత్రములు వేశవాటిలో పాములవాని నాగస్వరపుబాట, ఫాములాట. గడీబుగంతులు, మేషయుద్ధము, కుక్కుటయుద్ధము చూచిరి. అట పోయి దక్షిణమున 'మధుమావతి ' యను వేశ్యయిల్లుగాంచిరి. మధుమావతి మంబమంచెన శర్మగారి తండ్రి యగు మాధవశర్మకు ననుపుగత్తె. మధుమావతిచెల్లె లగుమదాలస యీమంచెనశర్మ మేనమామ యగు మీసాలప్పయద్వివేదులకొడుకు శ్రీధరుడు పరిగ్రహించిన నునుపులంజె. అక్కడి వింతలవర్ణణము కొంత., అప్పటికి సూర్యుడస్తమెంచెను. వేశవాటిలో జరగు జారధర్మాసనప్రశంస గొంత గలదు. ఇట్టిది శ్యామిలకుని పాదతాడితక ప్రహసనమున గూడ నున్నది. పిదప గోధూళిలగ్నమున మన కధాపాత్రము లిర్వురును నార్యవాటిక జేరిరి. ఒక్క తమ్మడిసానియింట విడిసిరి. అయింటి పూజరివిధవచేత దనరాక గామమంజరికి మంచెనశర్మ యెఱిగించెను. నిండు వెన్నెల గాయుచుండగా శివనమస్కారచ్చలమున బ్రాణ నాయకు నాపునర్భుపు డాయబోయి మ్రొక్కి కౌగిట దక్కి తనిసెను. కోమటిబిడ్డ డగు టిట్టిభునకు గామమంజరీ మంచెనశర్మ లాతమ్మడిసాని దగులుకొల్చిరి. జారజాయా వతులు నిందుజందురునకు గొఱ్ఱగినీట నర్ఘ్యమును, పచ్చగప్పురమున నారతియు నొసగి మ్రొక్కి స్వస్తి వేడిరి. కధ ముగిసెను.