పుట:2015.333901.Kridabhimanamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెందరో సద్వైద్యులు విషముష్టివిత్తులు మొదలగువానిని వాడదగినట్లు వాడి ఉత్సాహబలోపేతుల గావించి యుజ్జీవింపజేయుచున్నారు. వాని సముచితప్రయోగము వలన శాస్త్రసిద్ధాంత విశేషముల జాలంగా గుర్తించుచున్నారు. వాని వినాశమునకు వైధ్యులంగీకరింపరు. అట్లే అనుపమానకవితాహ్లాదమును గల్పించుచు, ననేక ప్రాచీన చరిత్రెవిషయముల నెఱింగించుచు, నింక ననేకాపూర్వశబ్దార్ధములైనయిట్టి చరురకృతులుగూడ బండితలోకమునకు బహూపకారకములుగా నున్నవి. వీని నాశపఱచుటకు సరసు లగువిద్వాంసులును సమ్మతింపరు. అందును క్రీడాభిరామము భాషాచరిత్ర కవిత్వ విశేషముల ననేకముల నెఱింగించుచున్నది. విద్వాంసు లీగ్రంధమునకై మిక్కిలి వేడుకపడుదురు. ఈగ్రంధమిట్టి యోగ్యతగలదే యనుటకు బ్రఖ్యాతపండితులు పలువురు ప్రమాణము. నేను నిందు ముందు దీని గుణవిశేషములను నిరూపింపనున్నాడను.

నాబి, నల్లమందు మొదలగువస్తువులవలనియనర్ధనుడగాఱుటకై దొరతనమువారు వాని యుత్పత్తిని మిక్కిలి తక్కువగాను, వాని విలువను మిక్కిలి యెక్కువగాను గావించుచున్నారు; కట్టుదిట్టమౌల నిట్టు గల్పించి యనర్హులచేతికి వాని నందకుండ జేయుచున్నారు.