పుట:2015.333901.Kridabhimanamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్లే యీ గ్రంధమునుగూడ జాల దక్కువ ప్రతులు మాత్రమే ముద్రించుటకును, విలువ మిక్కిలి యెక్కువ ఉంచుటకును ప్రకాశకు లేర్పాటు చేసికొనిరి. అప్రౌఢులకు, ఆపండితులకు, నీగ్రంధము నమ్మరాదు. ప్రాజ్ఞలును, పండితులును మాత్రమే దీనిని గొని పఠింప దగుదురు. వారును రహస్యముగా నుంచుకొనుటకును, నప్రాజ్ఞలచేతి కందనియ్యకుండుటకును బూటపడిననే దీనిని బడయ దగుదురు. ఇట్టి కట్తుదిట్టములకు బ్రకాశకులు భరపడిరి. ఈ గ్రంధ మిట్టి కట్టుదిట్టములతో సురక్షితమై యుండుగాక యనియే నేను గోరెదను. దీని మాతృక తంజావూరి పుస్తకశాలలోనున్నది. బ్రహ్మశ్రీ మా. రామకృష్ణకవిగారు దానిని బట్టి పెక్కేండ్లకు ముందు* దీని నొకతూరి ప్రకటించిరి. అముద్రణమున గ్రంధపాతము లెక్కువగా నున్నవి. తునాతునుకలై దురుద్దరమయియున్నతంజావూరి తాళపత్రప్రతిని బరిశోధించి గ్రంధపాతములను దప్పులను బెక్కింటిని నేను జక్కబఱచుకొని యుంటిని. నాదగ్గఱ నున్నపాఠములు పోయెనేని యిక నీగ్రంధమును సరిపఱచుట శక్యము కాదనియే నానమ్మకము. తంజావూరి తాళపత్రప్రతి ముక్కలుముక్కలై మిక్కిలి రూపు చెడియున్నది గాన దానినిబట్టి య్క దత్తత్పాఠముల నుద్ధరింప గుదురదు. ప్రత్యంతర మింతవఱ


  • 1909 లో నిమ్మృతకవిగ్రంధమాలికాకుసుమముగా బ్రకటితము.