పుట:2015.333901.Kridabhimanamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కెక్కడను దొరకలేదు. శ్రీనాధకృతిగా నిరూపితమగుచున్న యీ చతురకృతి సమసిపోగూడ దనునభిమానముచే నా దగ్గర నున్నపాఠముల నెల్ల సంకలనము చేసి యిట్లు ముద్రణమున కొసగితిని. తంజావూరి ప్రతికి మూలప్రతిగూడ బెక్కుగ్రంధపాతములు గలది గాబోలును. ఆ ప్రతివ్రాతలోనే పెక్కులోపములు గానవచ్చుచున్నవి. అందు గృత్యారంబము గానరాదు. నడుమ నడుమ గధా సమన్యము సరిగా నుండకపోవుట పెక్కుచోట్ల గాననగును. అట్టి పట్టులు గొన్ని ముద్రణమున జూపబడినవి. ఇతర గ్రంధములందు గ్రీడాభిరామములోనివిగా నుదాహృతములయినపద్యములు గొన్ని యిప్పుడీగ్రంధమున గానరావు. అవిలుప్తగ్రంధభాగములలోని వగు ననుటకు సంశయింపబని లేదు. మఱియి బెక్కుపద్యము లీ గ్రంధములోనివిగా రచనాదులను బట్టి గుర్తింపదగినవి గలవు. వానినిగూడ నుపోద్ఘాతములో జూపుదును. బహుప్రయోజనమైన యీ రసవత్ప్రబంధమునకు బ్రత్యంతర మింక నెక్కడనేని దొరకునేనెంతయు సంతసింప దగియుండును. సమగ్రగ్రంధోపలబ్ది కాశించుచున్నాడను. దోషముల దొలగించి మరల ముద్రించుటయ్యెను.

ఇందు సరిక్రొత్తగా గొన్ని విషయములు పీఠికలో జేర్పబడినవి.