పుట:2015.333901.Kridabhimanamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ:

శ్రీ గురుచరణం

తొలిపలుకు

విషముష్టివిత్తులు, నాభి, నల్లమందు, ఉల్లిపాషాణము ఎట్టి చెట్టవస్తువులో యీ క్రీడాభిరామముకూడ నట్టి చెట్టపుస్తకమే యనఁదగును. వస్తుపరిజ్ఞానము చాలని వారు, వాడవలసినవరుస నెఱుఁగనివారు, దురుద్రేకములకు మురియువారు, ధర్మాభిరతి లేనివారు, బాలురు, పామరులు, ముగుదలు వట్టి వస్తువులను ముట్టరాదు. ఇట్టి పుస్తకములను గూడఁ జేతఁ బట్టరాదు. అట్టివారి కివి యబ్బెనేని యనర్థములు గల్గినను గల్గవచ్చును. ఇఁక నిట్టి చెట్టతనము గల వస్తువులను, బుస్తకములను జెత్తకుప్పలోఁ బేర్పక యంగళ్ళకుఁ దెఛ్ఛుటేల, యచ్చొత్తించుటేల? అని యాక్షేపమేని యిదిగో సమాధానము. అవియు, నివియుఁ గొంత యపాయకరములే యయినను నెక్కువగా నారోగ్యవర్ధకములు, నానందాయకములు నగుచున్నవి. విరుద్ధోప యోగమున విషములే కాని యర్హోపయోగమున నివి యమృతములు పండితు లావస్తువులను, నీపుస్తకములను శుద్దిచేసి దోషములఁ దొలఁగించి విషవికారము లెసరేఁగ కుండునట్లును, ఆరోగ్యము నానందము నలవడునట్లును వాడుదురు. నాడీశక్తి నష్టమై నీరసించుచున్నరోగుల