పుట:2015.333901.Kridabhimanamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నుండువారి నట్లు పేర్కొనుట కలదు గాబోలును. ఆవల జనగా జూదరులగుంపు జూదమాడుచుండుపట్టుగానవచ్చెను. అక్కడే 'కనుమయవ్వలిదేశంబుకరణకాంతా యోరగ్రంతను సంపెంగనూనె యమ్ముట గానవచ్చెను. ఓరుగంటికి గనుమయవ్వలిదేశమనగా, కర్ణూలుమండలమమగునో, నల్లగొండల పశ్చిమదేశమగునో! సంపెంగనూనె నమ్ము నీకర్ణాటకాంత తెలికికులపుది. అక్కడి కుత్తరముగా మోహరివాడయు నందు కుట్రపువాడు ఱవికలు కుట్టుటయు గానవచ్చెను. మోహరివాడ యనంగా యుద్ధభటులుండువాడ యను కొందను.* ఆవాడ గడచి యుత్తరముగా జనగా గొన్నియిండ్లునందు స్త్రీలు ఈరీర్చుకొనుట, పసుపు మాఱు కొనుట గానవచ్చెను. ఇప్పటికి బాహ్యకటకవీధీవిటంకములను మనకధాపాత్రములు దాటిరి. లోతైనపరిఖి, ఆకాశమంటు ప్రాకారరేఖ, జనసంకులమైనవంకదార (మలుపుద్వారము), స్వర్ణవికారములయిన తలుపులుగల పెద్దగవని అనువాని వారు సూచి చేరి ప్రవేశించి చొరబాఱిరి. అట్లు వారు చొరబాఱుటలో రధ, ఘోట, శకట, కరటియూధములయెత్తిడి కోసరిల్లుచుండ వలనెను. " రాజమార్గము ఏనుగులు, గుఱ్ఱములు, బండ్లు, భటులు మొదలగువారిచే సంకులమై దూళి రేగుచు కష్టముమీద బోవదగినదిగా నుండును. కావున


  • చూ. అనుబంధము.