పుట:2015.329863.Vallabaipatel.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

43

లేర్పడినవి. సరిహద్దురాష్ట్రము, అస్సాములలోఁగూడఁ గాంగ్రెసు మిశ్రమంత్రివర్గముల నేర్పాటు జేసెను.

కాంగ్రెసీ ప్రాంతములలో శాసన సభా కార్యక్రమము నెఱవేర్చుటకుఁ బార్లమెంటరీ కమిటీ నొకదాని నేర్పాటు చేసెను. దీనికి వల్లభాయి యధ్యక్షుఁడు. ఈ హోదాలో నాయన కాంగ్రెసు మంత్రిమండలితో మిక్కిలిదక్షతతో వ్యవహరించెను.

పార్లమెంటరీబోర్డు కధ్యక్షుఁడుగా సర్దారు చూపిన శక్తి సాహసములు చరిత్రాత్మకమైనవి. ఎక్కడ నే కాంగ్రెసువాది నీతినిబంధనల నతిక్రమించెనని తెలిసినను నాతడు ప్రధాన మంత్రియైనను బ్రాథమిక సభ్యుఁడైనను జంకుగొంకులేక వెంటనే యాజ్ఞాపత్రము నందఁజేసి యాయరాచకము నంతమొందించుటలో నారితేఱినవాడని పటే లఖండఖ్యాతిఁగాంచినాఁడు.

బొంబాయి రాజధానిలో “నారిమన్” గొప్పనాయకుఁడు. సర్దారు కాయన ప్రాణస్నేహితుఁడు. అయినను నారిమ నెన్నికలలోఁ గాంగ్రెసుకు భిన్నముగాఁ బ్రవర్తించెనని తెలిసికొని యాయనను గాంగ్రెసునుండి వెడలఁగొట్టెను.

“డాక్టరు ఖరే” మధ్య రాష్ట్రములలోఁ బ్రధాన మంత్రిగాఁ గొంతకాలము పనిచేసినతర్వాతఁ బార్లమెంటరీ బోర్డుతో సంప్రదించకుండఁ దన యిష్టప్రకారము మంత్రులచేఁ రాజీనామా పెట్టించినప్పు డాయననుగూడఁ బటేలు పదవీచ్యుతుని జేసి కాంగ్రెసునుండి బహిష్కరించెను.

మన మాజీ ప్రధాని రాజాజీ, యూరపియన్ సెక్రటరీ పింఛను పుచ్చుకొని పోనున్న తరుణములో విందుఁజేయఁ