పుట:2015.329863.Vallabaipatel.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

వల్లభాయిపటేల్

గౌరవము, సామాన్యకృషీవలుఁడైన తనది కాదనెను. జాతీయ సమరమునం దెక్కువ పాల్గొన్న గుజరాతునకే యీ గౌరవము చెందునని కాంగ్రెసు సభ్యులవిధినిగూర్చి హెచ్చరించెను.

1935 లోఁ గాంగ్రెసు శాసనసభాప్రవేశ మంగీకరించుటచే నభ్యర్థులను నిర్ణయించుటకును, వారి నదుపాజ్ఞలలోఁ బెట్టుటకును, బార్లమెంటరీబో ర్డేర్పడెను. దానికిఁ బటేలు, రాజేంద్రప్రసాద్, ఆజాదు త్రిమూర్తులు నిర్ణయింపఁబడిరి. ఆ బోర్డు కధ్యక్షుఁడు పటే లగుటచేఁ గార్యభారమంతయు నాయనమీఁదనే పడెను.

ఆయన యారంభించిన పని మిక్కిలి పట్టుదలతోఁ జేయునని యందఱకుఁ దెలిసిన విషయమే. పటేలు భారతదేశ మంతటఁ బర్యటనజేసి “కాంగ్రెసుకు వోటిచ్చుట యనఁగా గాంధీజీ కిచ్చుట”యని ప్రజల కర్థమగునట్లు ప్రచారముచేసి, యభ్యర్థులను నిలిపెను.

కాంగ్రెసుకు వ్యతిరేకముగా దేశములో ననేకపక్షము లేర్పడెను. ప్రభుత్వమువారు పరోక్షముగా కాంగ్రెసు నోడించుటకు సర్వసన్నాహములు చేసిరి. ఎన్నికల సమయములో వివిధ పక్షముల గర్వోక్తులకు జవాబు చెప్పుచు “గాంగ్రెసు స్టీము రోలర్ బయలు దేరిన, దానిని వ్యతిరేకించు గంకరరాళ్లన్నియు నలిగి చూర్ణము కావలసినదే” యన్న పటేలుమాట యక్షరాల జరిగినది. ఎన్నికలలో గాంగ్రెసు కఖండ జయము కలిగినది. సంయుక్త ప్రాంతము, బీహారు, ఒరిస్సా, మధ్య రాష్ట్రాలు, బొంబాయి, మద్రాసు రాష్ట్రాలలో నధిక సంఖ్యాకులు కాంగ్రెసువా రగుటచేఁ గాంగ్రెసు మంత్రివర్గము