పుట:2015.329863.Vallabaipatel.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[20]

వల్లభాయిపటేల్

153

గింపఁబడును." బార్డోలీరైతులను గష్టముల నెదుర్కొనుటకు హెచ్చరించుచు, "వైశాఖజ్యేష్ఠమాసములలోఁ బ్రచండమగు నెండవేడిమి లేకపోయిన నాషాడశ్రావణమాసములలో వర్షము లుండ వను సంగతి రైతులయిన మీరు మఱవరాదు. లేక "చంపుటకుఁ జచ్చుటకుఁ బ్రభుత్వమువారు సైనికుల నాఱు మాసములలోఁ దయారు చేయుదురు. మనము కేవలము మరణించుటే నేర్చుకోవలయును. ఇట్టి సందర్భములో మూడు మాసము లెందుకు?"

వల్లభాయి పండితుడన నెవరో యిట్లు వివరించిరి. "భాషను గృత్రిమపద్ధతిని నిగూఢముగాఁ జేయువాఁడే పండితుడు." విద్యార్థులయెదుటఁబ్రసంగించుచు నిట్లన్నాఁడు. సర్పము తన కుబుసమును విడిచివేయుటలో నేమైన బాధగలుగునా? ఏమైన శ్రమచేయునా? ఇదేవిధముగా మనముకూడ నొకా నొకదినమునఁ బరప్రభుత్వ మను కుబుసమును విసర్జించఁగలము. ఇందులో శ్రమగాని కష్టముగాని యేమున్నది?" ఈ విధముగానే "ప్రభుత్వము దుష్కార్యము చేసిన రైతు సూటిగాఁ జెప్పవలసిన జవా బిది ............"పో,పో, నీబోటిరాజు లెందఱో మట్టిలోఁ గలియుట కనులారఁజూచితిని." బార్డోలీ సత్యాగ్రహ సమయములో బాలోడైలోఁ బ్రసంగించుచు - "ప్రభుత్వమువారు జైలు కతిథుల నాహ్వానించుచున్నారు. మీరు, వారికిఁ గావలసినంతమందిని బంపించఁగోరుచున్నాను. ఇదేవిధముగా నాయనను నిర్బంధించినపుడుకూడ భారతీయ వాతావరణ సూచకముగాఁ జెప్పెను. "ప్రభుత్వమువారు నా కాళ్ళను ద్రుంచివేసి ఱెక్కలులేని పక్షినవుదునని విశ్వ