పుట:2015.329863.Vallabaipatel.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

వల్లభాయిపటేల్

సించుచున్నారు. వర్షము కురిసినవెంటనే గడ్డిమొలచున ట్లనేకులు నూతనపురుషు లుద్భవించఁగలరని వారిని నేను హెచ్చరించుచున్నాను."

ఇవన్నియు యుద్ధకాలమునఁ బలికిన పలుకులు. సహజముగా వల్లభాయికి మాట్లాడు నలవాటు తక్కువ. ఒక్క మాటలో వచింపవలెనన నాయనలో మాటలుతక్కువ. క్రియ యెక్కువ. ఆయన వాక్శూరుడుకాడు వేదిక లెక్కి లెక్చర్లు కొట్టు మానిసికాదు. ఆయన పబ్లిసిటీ కోరఁడు. కార్యము ననుసరించి యాయన ప్రకటనఁ గోరునుగాని తననుగుఱించి ప్రకటన మాత్రముచేయఁడు. ఆయన గర్జించు మేఘమువంటివాఁడు కాఁడు. కుంభవృష్టి కురిపించు కారుమేఘమువంటివాఁడు. అటులనే యాయన మౌన మాశ్చర్యజనకమైనది. ఆయన సహజ వీరుఁడు. అందుచే నుత్తరకుమారప్రజ్ఞ లాయనకు సరిపడవు. ........కఠోరముఖము, దృడమైన దవడలు, శత్రువునుఁ గాయ్యమునకు కాలుద్రువ్వు కన్నులు, విషముతో నిండిన వ్యంగ్యము. ఇవి వల్లభాయి స్వరూపస్వభావములు. ఆయన ముఖవర్చస్సులో నాయన యాంతరంగికశక్తి కనుగొన నగునని యొక యాంగ్లేయ పత్రికావిలేఖకుఁడు పలికినమాట యక్షరాల నిజము. ఆయన వ్యంగ్య మాయనకు నమృతము వంటిది. సాధారణాచరులనేకాదు గాంధీజీపైనగూడ వ్యంగ్య బాణము వదలుటలో నాయన యీషణ్మాత్రము సంకోచించఁడు. తుపానులో నాయన పర్వతమువలె నచలుఁడు. విరోధియెడలఁ గఠినుఁడు. ఈ విషయములో గాంధీజీ నాయనకు నెట్టిపోలికయులేదు. విరోధి కాంగ్రెసువాఁడుకాని, తదితరుఁడుకాని,