పుట:2015.329863.Vallabaipatel.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

వల్లభాయిపటేల్

లోని యీ సహజగుణములే యాయనను సైన్యాధిపతిగాఁ జేసి "సర్దార్" ఆసనముపై నధిష్ఠింపఁ జేసినవి. రాజకీయవేత్తకు సహజలక్షణమగు - డిప్లమసీ -కుటిల రాజనీతి - యాయనలో లేదు. కాని గంబీరత, ప్రాణోత్తేజకరమైన భావావేశమున ఈ రెండు నావశ్యకమైనంత మాత్రమేయుండి యాయనను సైన్యాధిపతిఁ జేసినవి. సర్దారు కావశ్యకమైన యీ గుణము లాయనలో విరాజిల్లినవి. నీళ్ళలోఁ జేప యెట్లు సహజముగా గ్రీడించునో, యట్లే యుద్ధరంగములో నాయన విహరించును. రాజకీయవిషయములు, పరస్పర సమాలోచనలు, సంధులు, నాయన భావావేశమును శిధిలపఱచును. ఆయన ప్రతిభ యందుఁ గుంఠితమగును. ఈ సంగతియే స్వయముగా వచించినాఁడు. "పోరాటములోఁ గలుగు కష్టములు, చిక్కులు, వెంటనే నేను విడిదీసికోఁగలను. ఇట్టి సంకటావస్థలనుండి విడివడుశక్తి నాకెట్లు కలుగునో, నేను వివరించజాలను. కాని రాజీసంభాషణలు నాకు మనస్కరించవు. ఇట్టి యకర్మణ్య చర్చలలో నే ననేకపర్యాయములు గందరగోళములో బడితిని."

వాక్కులో నగ్ని

యుద్ధరంగమునం దాయన వాణిలో నగ్ని యావిర్భ వించును. యుద్ధకాలములో సరళమార్గమునఁగూడ నింతటి శక్తిమంతములైన శబ్దములను సృష్టించుటలో భారతనాయకు లందరిలోను సర్దార్ సమర్థుడు. ఆయన వాణిలో నగ్నికలదు. ఉదాహరణకు - "శత్రువుయొక్క కడ్డీ సలసల క్రాగవలసినదే. సమ్మెటమాత్రము చల్లగా నున్నప్పుడు మాత్రమే యుపయో