పుట:2015.329863.Vallabaipatel.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

135

వాఁడు. కవిత్వమన్న నాయనకుఁబ్రీతి. రచయితగా నాయన గణనీయుఁడు. రాజకీయకుతంత్రములు, కుట్రలు నాయనకు నచ్చవు. ఆయన యాదర్శవాది. గతములైన రెండు దశాబ్దములనుండి యాయనకుఁ బ్రజలలోఁగల పలుకుబడివలనఁ బ్రజలాయనయన్న మిక్కిలి గౌరవింతురు. ఆయనకుఁగూడఁ బ్రజా సమూహమన్నను, వారి పొగడ్తలన్నను బ్రీతి. ఆయన సాహస వంతుఁడు. భావోద్వేగి.

అనుష్ఠాన రాజకీయవేత్త

సర్దార్ పటేల్, కష్టించి పనిచేసెడి, పొదుపరులగు వ్యవసాయదారుల కుటుంబములో జన్మించెను. ఆయన గుజరాత్ లోని బార్ త్తర్ పటేదార్ వంశమునకుఁ జెందినవాఁడు. ఈ వంశస్థులు కొంచెము తలబిరుసైన యూహావిహారులుగాక యనుష్ఠానపరులు. ఆ వంశగుణము లీయనలో మూర్తీభవించినవి. ఆయనయు, నాయన సోదరుఁడు, విఠల్‌బాయి పటేలును, జాకచక్యముగల సమర్థులగు యోధులు. ఆయన కటువగు మితభాషి. రసజ్ఞత, కళలన్న నాయనకు బిడియము. ఆయనది కేవలము భారతీయదృక్పథము. ఆయన జన్మతః యోధుఁడు. సంఘటనాశక్తిగలవాఁడు. రాజకీయతంత్రములందుఁ బ్రవీణుఁడు. రాజకీయపుటెత్తులు వేయుటలో నాయన యద్వితీయుఁడు. విరోధులపట్ల నాయన నిర్దాక్షిణ్యుఁడు. రాజకీయముగా నడ్డంకని సర్దార్ భావించినవాఁ డేనాటికైనను నణఁగద్రొక్కఁబడుననుట నిశ్చయమే. ఆయన గొప్ప ప్రజానాయకుఁడు. ఎట్టి సమస్యలనైనను దేలికగ గ్రహింపఁగలఁడు. దేశ