పుట:2015.329863.Vallabaipatel.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

వల్లభాయిపటేల్

యున్న పరిస్థితి యిది. బహుశః యొక డజనుమందిపై నాధారపడి యుండుటకంటె, నిద్దఱపైనే యాధారఓడి యుండుట మంచిదేమో!

ఏ విధముగాఁ జూచినను నెహ్రూ-పటేల్ కూటమి యాశ్చర్యజనికమైనది. అది విరుద్ధశక్తుల విచిత్రస్నేహము. ఒక విధముగాఁ జూచిన. నది యొకదాని నొకటి పూర్తిచేయునట్టి కూటమి. పండిట్ నెహ్రూ యాగర్భశ్రీమంతుఁడు. విజ్ఞానవంతమగు ధనికకుటుంబమునకుఁ జెందినవాఁ డాయన. ఆయన చిన్నప్పటినుండి యింగ్లండులోఁ బెరిగెను. అందువలన జీవితములో ననేక విషయములపై నాయన యింగ్లీషు దృక్పథముతోనే యాలోచించును. వైజ్ఞానికముగ నాయనకు సోషలిజమన్న నమ్మకము, గౌరవముకలదు. కాని సామాజిక జీవితములో నలవాట్లలో నాయనది పూర్తిగా శ్రీమంతులవిధానము. నాయకత్వమును బొందుట కాయన యితరులవలెఁ గష్టపడ వలసిన యవసరమే లేకపోయెను.

తన రాజకీయ జీవితములోఁ బ్రారంభమునుండియు తన తండ్రి, గాంధీజీల ప్రోద్బలముతోఁ బండిట్ నెహ్రూ ముందుకు నెట్టఁబడెను. తన కా ప్రోద్బలముద్వారా లభించిన పదవుల స్థాయికిఁ దనకు స్వతః యున్న శక్తిసామర్థ్యములవలన నాయన రాఁగలిగెను. కాని చులుకనగా లభించిన యీ నాయకత్వ మాయన రాజకీయానుభవములో నొక శూన్యత నాపాదించి, రాజకీయ సమస్యలను, రాజకీయముల నాయన యొక విచిత్ర ధోరణిలోఁ బరిశీలించున ట్లొనర్చినది. ఆయన యుదారస్వభావుఁడు. గౌరవనీయుఁడు. మంచి సంస్కృతి, రసజ్ఞానము కల