పుట:2015.329863.Vallabaipatel.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

133


అనిశ్చితము

"భారతదేశము చరిత్రలో నతిక్లిష్టసమయములో నిప్పుడున్నదని గుర్తించినచో నీ విషయము మఱింత ప్రముఖముగాఁ గనుపించఁగలదు. దేశ మిప్పుడే విదేశపరిపాలననుండి విముక్తమైనది. వెంటనే కని విని యూహంచి యెఱుఁగనంతటి క్లిష్టసమస్యల నెదుర్కొనవలసివచ్చినది. అంతరంగభేదాభిప్రాయములు పలురకములై యనేకములుగా నున్నవి. నూతన ప్రభుత్వము స్థిరపడుటకుఁగూడ నవకాశము చిక్కలేదు. పంజాబ్, సింధులనుంచి కాందిశీకులరాక లన్ని ప్రణాళికలను దాఱుమా రొనర్చినవి. కాశ్మీర్, హైదరాబాదులు కొఱుక రాని కొయ్యలుగా నున్నవి. పాకిస్థాన్ శాశ్వతవైరుధ్యము, చాలమంది ఇండియన్ ముస్లిములు దానిని హర్షించుటవలన దేశమునకుఁ బ్రమాదము వాటిల్లఁజేయవచ్చునను భీతి వ్యాపించినది.

ఇటువంటి యనిశ్చితపరిస్థితిలోఁ బ్రతి విషయము నీ యిద్దరు రాజకీయ వేత్తల ప్రవర్తనపైనే యాధారపడియుండు నని దినదినము తేలిపోవుచున్నది. వా రిద్దరి పరస్పరసంబంధములు, దేశము నెదుర్కొనుచున్న పలుసమస్యలను వీ రెదుర్కొను విధానము, విడివిడిగాఁగాని, సంయుక్తముగాఁ గాని, వీరుచేయు నిర్ణయములు, భారతదేశ భవిష్యత్తును, గొన్ని తరములవఱకు, నిర్ణయించును. ఒకవిధముగాఁ జూచినచో భారతదేశ భవిష్య త్తీయిద్దరువ్యక్తుల ప్రవర్తనపై నాధారపడియుండుట శోచనీయముగానే కన్పట్టును కాని