పుట:2015.329863.Vallabaipatel.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

వల్లభాయిపటేల్

రెండు విధములఁ బరిష్కరించెను. మొదటిది విలీనీకరణము. రెండవది సమ్మేళనము. విలీనీకరణము ననుసరించి పరిసర రాష్ట్రములలోఁ జేర్చివేయబడినవి.

50 లక్షలు జనసంఖ్యగల సంస్థానములు ఒరిస్సా రాష్ట్రములోఁ బ్రప్రథమముగా 1948 జనవరి 1 వ తేదీనఁ గలిపివేయఁబడినవి.

14 సంస్థానములు మధ్యరాష్ట్రములో 1948 జనవరి 1 వ తేదీన జేర్చబడినవి.

మద్రాసు రాష్ట్రములోని బనగనపల్లి, పుదుక్కోట, సాందూర్ సంస్థానములుకూడ మద్రాసు రాష్ట్రములోఁ గలిపివేయబడినవి.

దక్కనులోని 17 సంస్థానములు 1948 మార్చి 8 వ తేదీన బొంబాయి రాష్ట్రములోఁ గలసిపోయినవి

1948 మే 18 వ తేదీన 3 సంస్థానములు బీహారు రాష్ట్రములో గలిసిపోయెను.

1948 జూన్ 10 వ తేదీన గుజరాతు సంస్థానము లను పేరుగల 157 సంస్థానములు బొంబాయిరాష్ట్రములోఁ గలిసి పోయినవి. బరోడా కొల్హాపూరువంటి గొప్ప సంస్థానములు కూడ బొంబాయి రాష్ట్రములో లీనమైనవి.

ఈ విధముగాఁ గొన్ని చిన్న సంస్థానములను బరిసర రాష్ట్రములలోఁ గలుపుట జరిగెను.