పుట:2015.329863.Vallabaipatel.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[16]

వల్లభాయిపటేల్

121

మిండియన్ యూనియన్ సహాయము కోరుటచే సైన్యాల నక్కడకుఁబంపి పాకిస్థాన్ సైనికులతోను, గొండజాతుల వారితోను, బోరాడవలసి వచ్చినది.

హైదరాబాదు నైజాము నసమర్థతవల్లఁ గాశీంరజ్వీ యనునతఁడు రజాకార్లను దోపిడిమూఁకకు నాయకుఁడై హిందువుల ధనమానప్రాణములు హరించుచుండఁగా బ్రజాశాంతి రక్షణకొఱకు నైజాముపైఁ బోలీసుచర్యలు తీసికొని మిలిటరీ గవర్నరు నధికారముక్రింద హైదరాబాదు నుంచుట జరిగినది. సంస్థానప్రభువు లను మత్తగజేంద్రములకుఁ బటేలువంటి యంకుశము లేకపోయిన వీరినిఁ బట్టపగ్గా లుండెడివికావు.

వల్లభాయిపటేల్ తన రాజకీయధురంధరత్వమువల్ల స్వదేశ సంస్థానములన్నిటిని భారత సమాఖ్యక్రిందకుఁదెచ్చెను.

ఆయన చతుస్సూత్ర ప్రణాళిక నొకదాని నేర్పాటు చేసెను. అదేదన, నా యా సంస్థానములు కొన్ని చేరి యొకకూటమిగా నేర్పడుటయో, లేక పరిసరరాష్ట్రాలలో లీనమైపోవుటయో, లేక కేంద్రప్రభుత్వమున కధికారమును దత్తత చేయుటయో, సంస్థానములలో బాధ్యతాయుతప్రభుత్వమును నెలకొల్పుటయో, యైయున్నది.

విలీనీకరణము

చిన్నచిన్న సంస్థానములలోఁ బరిపాలన భారత స్వాతంత్ర్య సంపాదనానంతరము కొనసాగించుటకు దుర్ఘటమైనది. వల్లభాయి యీ సమస్య నొక్క సంవర్సరములోగా