వల్లభాయిపటేల్
123
సమ్మేళనము
కొంచెము పెద్ద సంస్థానముల సమస్యకు మఱియొక పరిష్కారము. అనగా సంస్థానముల నొక కూటమిగా నేర్పఱచుట. కూటమిగఁజేరిన యీ సంస్థానముల పరిపాలన కొక కేంద్రప్రభుత్వ ముండును. పెద్ద హోదాగల సంస్థానాధీశు లొక మండలిగ నేర్పడి యైదుగురు సభ్యులుగల యొక యధిపతి మండలి నెన్నుకొందురు. దాని కొక యధ్యక్షోపాధ్యక్షు లుందురు. రాజ్యపరిపాలన విషయమున నధిపతిమండలి యధ్యక్షుని మంత్రాంగమునకు మంత్రివర్గ మెన్నుకోఁ బడును. ప్రతి సంస్థానాధిపతి తన రాజరికము నధ్యక్షుని కప్పజెప్పవలెను. ఆ యధ్యక్షునికి "రాజప్రముఖ్" అని హోదా యుండును.
ఈ నియమముల ప్రకారము నైసర్గిక, సాంఘిక, భాషా, వైజ్ఞానిక సన్నిహితత్వములుగల పెక్కు సంస్థానములు సమ్మేళనములుగ రూపొందినవి.
217 సంస్థానములు జాగీర్లు కలసి సౌరాష్ట్రముగ నేర్పడినవి. దీనినే కథియవా డందురు. 1948 ఫిబ్రవరి 1 వ తారీఖున నీ సమ్మేళన మేర్పడెను. దీనికి నవనగర్ మహారాజు రాజప్రముఖ్.
ఆల్వార్, భరత్‌పూర్, ధోల్పూర్, కరవోలీ యీ నాలుగు సంస్థానములతో మత్స్య రాజ్య మేర్పడెను. ధోల్పూర్ మహారాజు రాజప్రముఖుఁడు.
బుందేల్‌ఖండ్, బగేల్‌ఖండ్, 35 సంస్థానములతో