పుట:2015.329863.Vallabaipatel.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

వల్లభాయిపటేల్

త్వమువారు, గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హెచ్చరించినారు.

సర్దార్‌పటేలు మౌంట్‌బాటెనులు సంస్థానాధిపతులతోఁ జేసినమాలోచనల ఫలితముగా సంస్థానప్రభువు లధికముగా ఇండియన్ యూనియన్‌తో నొడంబడికఁ జేసికొనిరి. కాని కొన్ని తలతిక్క సంస్థానములు లేకపోలేదు. తిరువాన్కూర్ సంస్థానము తాను స్వతంత్రముగా నుందునని ప్రకటించినది. నైజాము తన రాజ్యపరిస్థితి ప్రత్యేకమైనదని, యందువల్ల దాను ఇండియన్ యూనియన్‌లోఁ గాని పాకిస్థాన్‌లోఁగాని చేరఁజాలనని, యయినప్పటికి నిండియారక్షణ కవసరమైన సహాయము చేయుదునని స్వాతిశయముగాఁ బ్రకటించినాఁడు.

గుజరాతులోనున్న జునాగడ్ నవాబు తాను జేరవలసిన యిండియన్ యూనియన్‌లోఁ జేరక మతాభిమానముతోఁ బాకిస్థాన్‌లోఁ గలిసినాఁడు. ప్రజలు దీని కిష్టపడక నవాబును ద్రోసిరాజు చేసి, తాము స్వతంత్రమును బ్రకటించినారు. అక్కడ నొక కల్లోలము బయలు దేరినది.

తూర్పు పాకిస్థాన్ (తూర్పు బెంగాల్) తూర్పుసరిహద్దున నున్న త్రిపురస్టేటులోఁ బాకిస్థానుగుండాలు చేరి యల్లకల్లోల మారంభించగా నిండియన్ యూనియన్ సహాయము నర్థించగా నక్కడకు సైన్యమును బంపించి శాంతి నెలకొల్పుట జరిగినది.

కాశ్మీర్ తా నే యధినివేశములోను జేరనని ప్రకటించినది. అంతట పాకిస్థాన్ ప్రభుత్వము కొండజాతులను బురికొల్పఁగా వారు గ్రామాలకు గ్రామాలను దోచుకొని పోవుటే గాక కాశ్మీర్‌నుగూడఁ గబళింపఁ బ్రయత్నించఁ గాశ్మీర