పుట:2015.329863.Vallabaipatel.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

119

వారు స్వదేశసంస్థానములమీఁద బ్రిటిషురాజులకుఁ గల సార్వభౌమాధికారము రద్దయినదన్నారు. ఇంతేగాక ప్రతి సంస్థానము నొక స్వతంత్రరాజ్యముగా నేర్పడు హక్కు వానికి లభించుననికూడ సూత్రప్రాయముగా సూచించినారు. దీనివల్ల భారతదేశ మిండియా, పాకిస్థాన్‌లు, రెండుగానేగాక యాఱువందలు ముక్కలుగా విభాగమైపోఁగల ప్రమాద మేర్పడినది. భారతదేశమునకు స్వాతంత్ర్య మిచ్చు చుంటిమని చెప్పి బ్రిటిషువారు దేశమును ముక్కలు చేసి కల్లోలమునకుఁ గారకులైనారు. ఈ నింద తమ నెత్తిపైఁ బడకుండ సంస్థానములు సూత్రప్రాయముగా స్వతంత్రరాజ్యములైనను వాని స్వాతంత్ర్యమును దాము గుర్తించమని యేదో యొక యధినివేశములోఁ జేరిపోవలసినదే నని యనిరి. కాని నిజమున కిది వారు మన స్వాతంత్ర్యమునకుఁ గలిగించిన గొప్ప ముప్పు. ఒక్క మాటలో వచింపవలెన్న వారు వచ్చిన స్థితిలో భారతదేశమును బెట్టి వెళ్ళిరి.

1946 సెప్టెంబరు 2 వ తేదీనుండి కేంద్రములో జాతీయ ప్రభుత్వ మున్నప్పటికిని బ్రత్యేకముగా సంస్థాన సమస్యలు పరిష్కరించుటకు 1947 జులై 5 వ తేదీని సర్దార్ పటేల్ క్రింద సంస్థానశాఖ యొకటి యేర్పడినది. కాని బ్రిటిషువారు స్వదేశ సంస్థానముల విషయమై చేసిన ద్వైధీభావ ప్రకటన వల్ల వచ్చిన స్వరాజ్యము దక్కునా యని యనుమానము కలిగినది.

ప్రతి సంస్థానము తనకు సమీపములో నున్న యధినివేశముతో నొడంబడిక చేసికొనుట మంచిదని బ్రిటిషు ప్రభు