పుట:2015.329863.Vallabaipatel.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

వల్లభాయిపటేల్

"అంతయు గందరగోళమై పోవునని, ప్రభుత్వము కూలి పోవునని తలపోసినవారుకూడ లేకపోలేదు. మన దేశములోనే బయలుదేరిన యభివృద్ధి నిరోధకులతో, విధ్వంసకులతో బ్రభుత్వము తలపడవలసి వచ్చినది. చేరువనుండి దూరమునుండి కూడ మనపైఁ గన్ను వేసిన దుష్టగ్రహములు బారినుండి మన దేశమును గాపాడుకోవలసి వచ్చినది. ఏమైనను బ్రజల సాహాయ్యసంపదలవల్లనేమి, సముత్సాహ పూరితులైన, ప్రజాసేవకుల యవిరళ కృషివల్లనేమి, స్వాతంత్ర్యమునే తుడిచిపెట్టి వేయఁగల యా మహోపద్రవములనుదాటి బయటపడఁ గలిగితిమి. ఈ క్లిష్టదశాపరంపరలో మునిగియున్నందువల్ల నతిముఖ్యమైన యితర సాంఘికార్థికసమస్యల పరిష్కారమునకు హృదయపూర్వకముగా మేము ప్రయత్నించ లేక పోయితిమి. మన సర్వశక్తులు వినియోగించి కృషిచేసినప్పుడు కాని యీ సమస్యలకు నిశ్చితమైన పరిష్కారమార్గము లభ్యము కాదు - ఈమాట నమ్ముఁడు. యుద్ధమువల్లఁ గలుగగల విజయములకుఁ దీసిపోని శాంతి విజయసాధనకుఁ గృషి చేయవలయునని మేము చాల ప్రయత్నించితిమి. కాని విరామము లభించ లేదు.

"గతసంవత్సరము మన హృదయములకుఁ దగిలిన గాయము లింకను మానిపోలే దను విషయము నాకుఁ దెలియును.

"తల దాచుకొనుటకు మాకు నీడఁ జూపించుఁడు, మాకు బ్రతుకు తెరువు కల్పించుఁడని లక్షలకొలఁది శరణార్థులు నేఁడు మనలను బ్రశ్నించుచున్నారు.

"కాశ్మీర్ రంగములో దుండగీండ్ర యత్యాచారము