పుట:2015.329863.Vallabaipatel.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

95

లింకను సాగుచునే యున్నవి. దేశవిభజనవల్లఁ గలిగిన యఘాతమునుండి మనము కోలుకోలేదు. అన్నిటికంటె నత్యంత విషాద సంఘటన భారతపిత దారుణహత్య - మన హృదయములను నింకను గెలఁక వేయుచున్నది. చీఁకటివేళల మనకుఁ దెన్ను చూపిన యా కరుణజ్యోతి నేఁ డదృశ్యమైపోయినది. ఇక నార్థిక రంగములో ననియు సవ్యముగా జరిగిపోవుచున్నవను సంతృప్తితో వ్యవహరించుచున్నందుకు మన మిప్పటికి దెబ్బ తినుచునేయున్నాము. సమన్విత కృషి జరుగకపోవుటవల్ల నేమి, యజమానులకుఁ గార్మికులకు మధ్య, సామరస్యము లేనందువల్ల నేమి, మన మింకను జిక్కులకు లోనవుచునేయున్నాము.

"అందువల్ల గత సంవత్సరము మన యాశలలోఁ గొన్ని మాత్రము ఫలించినవి. అనుకొన్న యాపద లనేకము తప్పి పోయినవి మొత్తముమీద మనల నెదుర్కొన్న కష్టము లన్నింటిని నెట్టుకొని వచ్చితిమి. గత సంఘటనలనుగుఱించి విచారము, భవిష్యత్తును గుఱించి భయాందోళనలు మన హృదయములలో ముప్పిరిగొనుచున్నవి. ఏ మహత్తరలక్ష్య సాధనకై, మనము స్వాతంత్ర్యసమరము సాగించితిమో, యా లక్ష్యమును విడనాడనంతవఱ కెట్టి యకుంఠిత ధైర్య సాహసములతో, వజ్రసంకల్పముతో వ్యవహరించి మనలనెదుర్కొన్న ప్రమాదములనుండి బయటఁబడితిమో యట్టి ధీరోదాత్త గుణ సంపత్తి మనకుఁ గొఱవడనంతవఱకు సుశిక్షితులైన సైనికులవలె మనము బాధ్యతాయుతముగాఁ బ్రవర్తించినంతవఱకు - భవిష్యత్తుపట్ల మన మాశతో మెలఁగవచ్చును.

"వేయి సంవత్సరములు గడచినతర్వాత భౌగోళికముగా