పుట:1857 ముస్లింలు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

నుండి గుర్తింపు పొందారు. ఈ గుర్తింపుతో మౌలానా ఖాసిం నానాతవి పోరాటం విముక్తి పోరాటంలో భాగమయ్యింది. ఈ పరిణామంతో తిరుగుబాటు నాయకులలో, స్వదేశీ సైనికులలో ఎనలేని ఉత్సాహంతోపాటు ఆత్మవిశ్వాసం మరింతగా పటిష్టపడింది. (Deoband Ulema's Movement for the Freedom of India, Farhat Tabssam, Manak, New Delhi, 2006, P. 7)

బాగ్-యే-షేర్‌ అలీ దాడి

ఆంగ్ల సైన్యాలు ఉత్తర ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ మీద దాడికి వెడుతున్నాయని మౌలానా నానాతవికి సమాచారం అదింది. ఆత్మవిశ్వాసంగల యోధులున్నాఆయుధాలు లేకపోవటంతో స్వదేశీ యోదులలో ఆందోళన వ్యక్తమైంది. ఆ ఆందోళన నుండి బాగ్-యే-షేర్‌ అలీ రోడ్డు దాడి ఆలోచన వారిలో కల్గింది. ఆంగ్ల సెన్యం షహరాన్‌పూర్‌కు బాగ్-యే-షేర్‌ అలీ రోడ్డు గుండా పోవాలి. అ సమయంలో ఆంగ్ల సైన్యాల మీద సాహసిక దాడి జరిపి ఆయుధాలను కొల్లగొట్టాలని నిర్ణయమైంది. ఆ నిర్ణయం మేరకు మౌలానా ఇమ్‌దాదుల్లా నాయకత్వంలో 30-40 వరకు గల మెరికల్లాంటి యోదులు సిద్ధమయ్యారు. బాగ్-యే-షేర్‌ అలీ రోడ్డుకు ఇరుపక్క ల గల తోటలోని గుబురు చెట్లలో విప్లవ యోదులు దాక్కొన్నారు. ఆంగ్ల సెన్యం దారిదాపులకు రాగానే మౌలానా ఇమ్‌దాదుల్లా ఆదేశాల మేరకు దాడి ఆకస్మికంగా ఆరంభమైంది. ఈ హఠాత్పరిణామానికి ఆంగ్ల సెన్యం కకావికలైంది.

ఈ సాహసిక దాడిలో స్వదేశీ యోదులకు విజయం లభించింది. మౌల్వీల వ్యూహరచన, సహచరుల ధైర్యసాహసాల ఫలితంగా కొన్ని ఆయుధాలు, ఒక ఫిరంగిని స్వదేశీ బలగాలు చేజిక్కించుకోగలిగాయి. శత్రు పక్షంలో ఒక సైనికుడు మృతి చెందగా స్వపక్షంలో ఎటువంటి నష్టం జరగకుండా విప్లవకారులు తమ స్థావరం చేరుకున్నారు. ఈ విధాంగా విజయవంతమైన బాగ∑-యే-షేర్‌ అలీ రోడ్డు (Bagh-e-Sher-Ali Road) దాడి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. ఈ విధంగా ఖురాన్‌, హదీసుల జ్ఞానాన్ని పదిమందికీ పంచుతూ ఆధ్యాత్మిక బోధన ప్రధాన వ్యాపకంగా జీవితాలను గడిపే మౌల్వీలు పరాయి పాలకుల తరిమివేతకు ఆయుధాలు చేపట్టి సాహసిక దాడిలో పాల్గొని సంచలనం సృష్టించారు.

96