పుట:1857 ముస్లింలు.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
మౌల్వీలు

ఏనాడూ ఊహించని రీతిలో, ఊహించని వర్గాల నుండి సాహసిక సాయుధదాడి జరగటంతో ఆంగ్లేయాధికారులు ఆందోళన చెందటంతోపాటుగా ఆశ్చర్యానికిగురయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఆంగ్ల సైన్యాలను గుప్పెడు మంది ఎదిరించటం ఆయుధాలను ఎత్తుకెళ్ళటం ఆంగ్లేయాధికారులకు తీవ్ర అవమానంగా తోచించి. ఈస్ట్‌ఇండియా కంపెనీ అధికారులు ఈ చర్యను తీవ్రంగా తీసుకున్నారు. ఈ చర్యకు ప్రతీకారంగా బాగ్-యే-షేర్‌ అలీ రోడ్డు (Bagh-e-Sher-Ali Road) దాడిలో పాల్గొన్న వారందర్ని తుదముట్టించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం మేరకు ముజఫర్ పూర్‌ కలక్టర్‌ షామ్లిలో గల థానా భవన్‌ ముట్టడికి ఆదేశాలు జారీచేశాడు.

1857 ముస్లింలు.pdf

మాతృభూమి సంరక∆ణలో విజయమో వీర స్వర్గమో అంటూ తెగించి పోరాడుతున్న స్వదేశీ యోదులు


చరిత్ర సృష్టించిన షామ్లి యుద్ధం

ఆంగ్ల సైన్యం విప్లవకారుల మీద దాడి జరిపేందుకు షామ్లికి బయలుదేరింది. ఆధునిక ఆయుధాలూ, అపార సైనికబలగం, ప్రత్యేక శిక్షణ పొందిన ఆంగ్లేయాధికారుల నాయకత్వంలో ఆంగ్ల సైన్యాలు షామ్లి చేరుకుని షామ్లి కోటను ఆక్రమించుకున్నాయి. స్వదేశీ యోదుల స్థావరంగా పేర్గాంచిన థానా భవన్‌ను పూర్తిగా చుట్టుముట్టాయి.

ఈ విషయం తెలుసుకున్నమౌలానా ఇమ్‌దాదుల్లా, మౌలానా ఖాశిం నానాతవిలు యుద్ధానికి సిద్ధమయ్యారు. అందుబాటులో ఉన్న యోధులను పోరాటానికి

97