పుట:1857 ముస్లింలు.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

సన్నద్ధులను చేసి శత్రువుతో తలపడేందుకు తయారయ్యారు. ఈ ముట్టడి విషయం తెలుసుకున్న మౌలానా శిష్యులు, అనుచరులు, సహచరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో షామ్లి వైపుకు తరలి వచ్చారు. ఈ విధంగా షామ్లికి వచ్చిన యోధులు మౌలానా ఖాసిం, మౌలానా ఇమ్‌దాదుల్లాల నాయకత్వంలో శత్రువుతో అమీతుమీ తేల్చుకోడానికి ఏకమయ్యారు.

ఆధునిక ఆయుధాలు లేకపోయినా దొరకబుచ్చుకున్న ఆయుధాలతో, ఆత్మ విశ్వాసంతో యుద్ధానికి సిద్ధ్దమై వచ్చిన స్వదేశీ యోధులు షామ్లిలోని ఒక మసీదును తమ స్థావరంగా చేసుకున్నారు. ఆ స్థావరం నుండి ఆంగ్ల సైన్యాలు మాటువేసి ఉన్న షామ్లి కోట (Shamli Gerri) మీదకు దాడిని ఆరంభించారు. ఈ పోరాటంలో మౌలానా ఖాశిం నానాతవి, మౌలానా ఇమాం రబ్బాని, మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహి ఎంతో సాహసంతో వ్యవహరించారు.

ఆంగ్ల సైనికులున్న షామ్లి కోటకు ప్రహరీగోడ లేకపోవటంతో అన్ని వైపుల నుండి ఆంగ్ల సైనికులు స్వదేశీ యోదుల మీద తుపాకి గుళ్ళను, ఫిరంగులతో నిప్పుల వర్షాన్ని కురిపించసాగారు. స్వదేశీ యోధులు కోటలో ప్రవేశించడానికి ఆవకాశం లభించలేదు ముందుకు నడిపిస్తూ వేగంగా ముందుకు సాగారు. ఆయనస్వయంగా కోట గోడవారగా ఉన్న చప్పరం మీదుగా పైకి ఎక్కి కోట ప్రవేశం వద్దనున్నశత్రువుల ఫిరంగిని పేల్చి వేయడంలో కృతకృత్యులయ్యారు. ఆ కారణంగా స్వదేశీ యోదులు తేలిగ్గా కోటలోనికి ప్రవేశించగలిగారు.

ఈ విధాంగా కోటలోకి ప్రవేశించిన స్వదేశీ యోధులు వీరోచితంగా శత్రువుతో ముఖాముఖి కలబడ్డారు. మాతృభూమి విముక్తి లక్ష్యంగా, పరాయిపాలకుల మీద కసితో పోరుబాటను ఎంచుకున్న యోధు లతో కలబడటం ఆంగ్లేయుల కిరాయి సైనికులకు సాధ్యం కాలేదు. ఈ పోరాటంలో ఆంగ్ల సైనికుల మీద స్వదేశీ వీరులు పైచేయి సాధిం చారు. శత్రు సైనికులు పలాయనం చితగించారు. స్వదేశీ యోధు లు అతి సునాయాసంగా విజయం సాధించినా స్వదేశీ సైన్యంలోని ఒక దాళానికి నాయకత్వం వహిసున్న యోధు లు మౌలానా ముహమ్మద్‌ హఫీజ్‌ జమీర్‌ అహ్మద్‌ కన్నుమూసారు. మౌలానా నానాతవి, మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహిలు గాయపడ్డారు.

98