పుట:1857 ముస్లింలు.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

విప్లవ కేంద్రం థానా భవన్‌

ప్రదమ స్వాతంత్య్రసంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను పోరుబాట నడిపన మౌలానా ఖాశిం నానాతవి (Moulana Qasim Nanawtawi) షామ్లి కంద్రంగా విప్లవ కార్యకలాపాలను సాగించారు. రాజకీయంగా-ఆధ్యాత్మికంగా- సామాజికంగా సంస్కరణలను ఆశించే, విప్లవాత్మక భావాలు గల మౌల్వీ ఖాసిం ఆంగ్లేయు లకు బద్ధ వ్యతిరేకి. ఆధ్యాత్మిక-సాంఫిుక సంస్కరణలో తన వ్యతిరేకులను ఏమాత్రం లెక్కచేయక ముందుకు సాగిన ఆయన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విప్లవకర పంథాను అనుసరించారు.

మీరట్ లో రగిలిన తిరుగుబాటు ఢల్లీ చేరి ఆంగ్లేయుల చెర నుండి ఢల్లీ విముక్తం కాగానే మౌలానా నానాతవి తిరుగుబాటుకు పథక రచనచేసి పరాయి పాలకులకు వ్యతిరేకంగా పోరుబాట నడవాల్సిందిగా ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ఈ వినతి మేరకు స్వాతంత్య్ర సంగ్రామ యోధులైన మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహీ, మౌలానా అబ్దుల్‌ హయ్‌, మౌలానా హాజి ఇమ్మాదుల్లా ముహాజిర్‌ ఆయన వెంట నడిచారు. మౌలానా నానాతవి సహచరు లలో ఒకరైన మౌలానా షేక్‌ ముహమ్మద్‌ మాత్రం ఆంగ్లేయులతో యుద్ధం వినాశకరం కాగలదన్న అభిప్రాయం మీద స్థిరంగా ఉండిపోయారు. ఆ విధంగా వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఆయన నానాతవి వెంట నడవటం మాత్రం వీడలేదు.

ఈ యోధులంతా ఉత్తర ప్రదశ్‌లోని థానాభవన్‌ (Thana Bhavan) లో కలసి ఆంగ్లేయుల మీద పోరాటానికి పదక రచన చేశారు. ఆంగ్లేయుల మీద పోరుకు సిద్ధపడిన అనుచరులను, ప్రజలను సమీకరించారు. మౌలానా నానాతవి 'కమాండర్‌- ఇన్‌-చీఫ్‌' (సర్వసైన్యాధ్యక్షులు) గా భాధ్యాతలు చేపట్టారు. మౌలానా ఇమ్‌దాదుల్లా మహాజిర్‌ కమాండర్‌గానూ, మౌలానా ముహమ్మద్‌ మునీర్‌, మౌలానా ముహమ్మద్‌ హఫీజ్‌ జమీర్‌ అహ్మద్‌లు రెండు బెటాలియన్లకు నాయకులుగానూ నియమితులయ్యారు.

ఈ స్వదేశీ సైన్యానికి చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ నుండి అధికారిక గుర్తింపు కోసం మౌలానా నానాతవి ప్రయత్నాలు ఆరంభించారు. ఆయన ఢిల్లీ చక్రవర్తి జఫర్‌కు లేఖ రాస్తూ చక్రవర్తి ప్రతినిధులుగా ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు అనుమతి అర్థించారు. ఆ ప్రయత్నాలలో భాగంగా నవాబ్‌ షబ్బీర్‌ అలీ సహకారంతో చక్రవర్తి

95