పుట:1857 ముస్లింలు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహిళలు

వారసత్వంగల ఆమె ఆంగ్లేయుల ఆధిపత్యాన్నీ, అధికారాన్నీ అంగీకరించలేదు. కంపెనీపాలకులు మాతృభూమిని కబ్జా చేయటం భరించలేకపోతున్న ఆమె 1857 నాటి విముక్తిపోరాటంలో భాగస్వాములయ్యారు.

మాతృభూమి సేవలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఎంతటి త్యాగానికైనా సిధపడి తిరుగుబాటుయోధులతో కలిసి శత్రువుపై కలబడ్డారు . ఈ సందర్బంగా ఆంగ్లేయ

ఖ్మాండులోని బేగం హజరత్‌ మహల్‌ సమాధి

సైన్యాలు ఆమెను అరెస్టు చేశాయి.బ్రిటిషు సైనిక న్యాయస్థానం విచారణ తంతును పూర్తిచేసి ఉరిశిక్షను ప్రకటించింది.పుట్టిన గడ్డను పరాయి పాలకుల నుండి విముక్తం చేయటంలో ప్రాణాలను అర్పించి బేగం జమీలా చరితార్ధురాలయ్యారు. (Who is Who of Indian Martyrs Dr. P.N. Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 64)

ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయ సైనికులతో పోరాడుతూ శతృ సైనికులను నిలువరించటంలో గాని, తిరుగుబాటు యోధు లకు సహాయసహకారాలు అందించటంలో గాని మహిళలు తమదెన పాత్ర నిర్వహించారు. అటువంటి మహిళా పోరాటయోధులలో బేగం ఉమ్దాది విశిష్ట స్థానం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూరు జిల్లాలోని ఓ గ్రామంలో 1831లో జన్మించిన ఉమ్దా భయమంటే ఏమిటోఎరుగని జాట్‌ కుటుంబానికి చెందిన యువతి. శత్రువుతో తలబడటంలో ఏమాత్రం వెనుకాడని వారసత్వ సంపదఆమె స్వంతం. పరాయి పాలకులను పాలద్రోలి స్వదేశీయుల పాలనను ప్రతిష్టించుకో

83