పుట:1857 ముస్లింలు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

శత్రుమూకలను సంహరించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోరులో గాయపడిన ఆమె బ్రిటిష్‌ సైనికాధికారులకు బందీ అయ్యారు. ఆ యోధురాలికి కూడసైనికాధికారులు ఉరిశిక్ష విధించారు. మాతృదేశం కోసం మరణించటం అత్యంత గౌరవంగా భావించిన బేగం రహీమా చిన్నవయస్సులోనే, పుట్టిన గడ్డకోసం ప్రాణాలనుఅర్పించారు. (Who is Who of Indian Martyrs, Dr. P.N. Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 118)

పరాయి పాలకుల మీద పోరు సల్పుతుమ్మ ప్రతి ఒక్కరూ తన బిడ్డలని ప్రకటించి వారి క్షేమం కోసం అహరహం కృషిసల్పిన మహిళామతల్లి అస్గరీ బేగం 1811 జులై 5న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌ జిల్లాలో జన్మించారు. ఆమె కుటుంబం ప్రథమ స్వాతంత్య్రసంగ్రామయోధాుల కుటుంబం. 1857నాటి పోరాటంలో పాల్గొమ్మ ఖ్వాజీ అబ్దుల్‌ రహమాన్‌ ఆమె కుమారుడు. అబ్దుల్‌ రహమాన్‌ను బ్రిటిష్‌ ప్రబుత్వం ఉరితీసింది. ఆ తిరుగుబాటులో ఆమె కూడ పరోక్షంగా పాల్గొన్నారు. తిరుగుబాటు వీరులకు ఆశ్రయం కల్పించటం, ఆహార పానీయాలు అందించటంలో సహాయపడ్డారు . ఈ విషయం పసిగట్టిన ఆంగ్లేయ సైనికాధికారులు ఆమెను బంధించి రాజద్రోహం ముద్రవేశారు. తిరుగుబాటు యోధుల రహస్యాలు చెప్పమని వేధించారు. రహస్యాలు చెప్పకుంటే సజీవదహనం చేస్తామని బెదిరించారు. ఆ బెదిరింపులు ఏవీ కూడ ఆమె పట్టుదలను సడలించలేక పోయాయి. చివరకు భయంకర చిత్రహింసల పాల్జేసినా ఆమె లొంగలేదు, పెదవి విప్పలేదు. అందుకు ఆగ్రహించిన అధికారులు ఆమెను సజీవదహనం చేయించారు.ఆంగ్లేయ సైనికాధికారుల హింసాత్మక చేష్టలను భరించిన అస్గరీ బేగం మాతృభూమిసేవలో చిరునవ్వుతో బలయ్యారు. (Freedom Movement and Indian Muslims, Santimony Ray, P.P.H, New Delhi,1993, P.116 ; Who is Who of Indian Martyrs, Dr. P.N. Chopra, Govt. of India Publications,New Delhi.1973, P.118)

ఆంగ్లేయ పాలకుల నుండి సొంత గడ్డను విముక్తం చేసి స్వదేశీయుల పాలన చూడాలన్న ప్రగాఢకాంక్ష కలిగిన బేగం జమీలా విరుచుకుపడు తున్న ఆంగ్లేయ సైనికులనుతిరుగుబాటు యోధులతో కలసి నిలువరించిన యోధులలో ఒకరు. ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూరు జిల్లాలోని ఓ గ్రామంలో 1835లో జన్మించారు. ఆమె పఠానుకుటుంబానికి చెందిన యువతి. పరాయిపాలకుల పెత్తనాన్ని ఏమాత్రం సహించని

82