పుట:1857 ముస్లింలు.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

వాలన్నది ఆమె ఆకాంక్ష. ఆ లక్ష్యసాధన కోసం 1857లో పరాయి పాలకుల పెత్తనానికి చరమగీతం పాడాలనుకుంటున్న యోధుల సరసన చేరి స్వదేశీపాలకుల పక్షాన తిరుగు బాటుకు తోడ్పడ్డారు. ఆ సందర్భంగా ఆంగ్లేయ సైన్యాలు ఆమెను అరెస్టుచేసి సైనిక విచారణ జరిపి ఉరిశిక్ష విధించాయి. ఆ శిక్ష అమలు జరుపుతున్నసమయంలో ఆమెతోపాటు మరో 11మంది యువతులను కూడ ఆంగేయులు ఉరిశికకు గురిచేశారు.

ఈ విధంగా బ్రిటిష్‌ సైనికులతో పోరాడి అమరగతి పొందిన వారు కొందరైతే, పోరును పునరుద్దరించడానికి శత్రువు కళ్ళుగప్పి తప్పించుకున్నవారు మరికొందరు ఉన్నారు. అదేవిధంగా తిరుగుబాటు యోధుకు వ్యతిరేకంగా పనిచేసిన వారిలో కూడా పలువురు మహిళలు ఉన్నారు. అటువింటి వారిలో బహదూర్‌ షా జఫర్‌ ముద్ధుల భార్య జీనత్‌ మహాల్‌ ఒకరు కాగా ప్రస్తు త మధ్యప్రదేశ్‌ రాష్ట్రరాజధాని భోపాల్‌ సంస్థానాధీశు రాలు నవాబ్‌ సికందర్‌ జహాన్‌ బేగం మరోకరు . భోపాల్‌ సంస్థానంలోని పలు ప్రాంతాలలో తిరుగుబాటు ప్రజ్వరిల్లగా, ఆంగ్లేయులకు అనుకూలంగా నడుచుకున్న సికిందర్‌ జహాన్‌ బేగం ఆ తిరుగుబాట్లను పూర్తి స్థాయిలో సాగనివ్వలేదు.

ఈ మేరకు ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో అత్యంత ధైర్యసాహసాలతో ఆంగ్ల సైనికులను ఎదిరించి పోరాడిన మహిళలలో ముస్లిం మహిళలు గణనీయ సంఖ్యలో ఉండటం విశేషం. చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఫిుక జనసముదాలతో పాటుగా వందలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డారు; పలువురు సజీవ దహనమయ్యారు; ఉరి తీయబడ్డారు; అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ సమాచారాన్ని బ్రిటిష్‌ అధికారుల డైరీలు, లేఖలు, ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలు, ఆంగ్లేయాధికారులు తిరుగుబాటు గురించి స్వయంగా రాసిన చరిత్ర గ్రంథాలు బహిర్గతం చేస్తున్నయంటే, పురుషులకు దీటుగా సాగిన ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో అర్థ్ధం చేసుకోవచ్చు.

                      . . .

84