పుట:1857 ముస్లింలు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మహిళలు

ముందర్‌ గురించి డాక్టర్‌ ఛోప్రా వివరిస్తూ ఆ యోధురాలి పేరు ముందర్‌ (Mundar) అని స్పష్టం చేశారు. ( Who's Who of Indian Martyrs, Vol.3, Govt. of India Publications, New Delhi, 1973, P.102.).

ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడ లెక్కచేయని సాహసి హబీబా బేగం, బ్రిటిషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధుల క్షేమం కోరుతూ సజీవదహనమైన అస్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జమీలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా తదితరులు ఎందారో ఉన్నారు.పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడు

బేగం హజరత్‌ మహల్‌ స్వతంత్ర ప్రభుత్వం అధికార రాజముద్రిక

కునేందుకు ఆత్మాభిమానులైన బిడ్డలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారన్న విషయానికి నిలువెత్తు తార్కాణం హబీబా బేగం.1833లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌ పూర్‌లో జన్మించిన ఈమె 1857లో తిరుగుబాటు యోధులతో కలసి రణరంగ ప్రవశం చేశారు. సోదర తిరుగుబాటు వీరులతో కలిసి బ్రిటిష్‌ సైనికపటాలాల మీద లంఫిుం చారు.ఆ పోరాటంలో ఆమెను ఆంగ్ల సేనలునిర్బంధించాయి. పరాయి ప్రభుత్వంపై తిరగబడిన నేరానికి 1857లో బ్రిీషు సైనిక న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షకు ఏ మాత్రం భయపడకుండా హబీబా సంతోషంగా ఉరిని స్వీకరించారు. బ్రిటిష్‌ సైనికదళాల మీద విరుచుకుపడ్డ తిరుగుబాటు దాళాలతో కలసి పోరుబాటను ఎంచుకున్న బేగం రహీమా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో 1829లో జన్మించారు. ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ సైనిక మూకల మీద ఆమె సమర శంఖారావం పూరించారు. ఆయుధం ధరించి తిరుగుబాటు దాళాలతో కలిసి

81