పుట:1857 ముస్లింలు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

లేఖ రాసి పంపి, ముందు జాగ్రత్తల గురించి హెచ్చరించారంటే, ఆంగ్లేయాధికారులు ఆమెను జాన్‌ ఆఫ్‌ ఆర్క్‌ తో పోల్చారంటే ఆకు పచ్చదుస్తుల మహిళ ఎంతటి ఘటికురాలో మనం ఇట్టే ఊహించవచ్చు.

ఈ విధగా శత్రువును సాయుధంగా ఎదాుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దాళాలను ప్రోత్సహించినవారు, ఆశ్రయ కల్పించి ఆదుకున్న మహిళలు ప్రదమ స్వాతంత్య్రసంగ్రామంలో ఎందరో దర్శనమిస్తారు. ఆనాడు మాత్రుభూమిని బ్రిటిషు పాలకులనుండి విముక్తి చేయడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరుబాటసాగిన ముస్లిం యువతులలో మరొకరు ముందర్‌. ఆమె ఝాన్సీరాణి లక్ష్మిబాయి అంగరక్షకురాలు. రాణి లక్ష్మిబాయికి ముందర్‌ కేవలం అంగరక్షకురాలిగా మాత్రమేబాధ్య తలునిర్వర్తింలేదు. ఆమె రాణికి ఇష్టసఖి మాత్రమే కాదు ఆంతరంగిక సలహాదారుగా కూడా వ్యవహరించారు. (1857 తిరుగుబాటు, తెలుగు అకాడమీ ప్రచురణ, హైదారాబాద్‌, పేజి.112).

ఆమె ఎల్లప్పుడూ రాణికి నీడలా వెన్నంటి నిలచి శత్రువుతో పోరాడిన ధైర్యశాలి. ఆంగ్ల సైన్యాలను ఎదుర్కొంటూ, రాణితో పాటు ఆమె కూడ బ్రిటిష్‌ సైనికాధికారుల తుపాకి గుళ్ళకు బలయ్యారు. ఈ విషయాన్నిఅప్పటి సెంట్రల్‌ ఇండియా ప్రాంతానికిగవర్నర్‌ జనరల్‌ ప్రతినిధిగా నియమించబడిన రాబర్ట్‌ హెమిల్టన్‌ 1858 అక్టోబర్‌ 30నఅప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి ఎడ్‌సన్‌కు ఒక లేఖ రాస్తూ రాణి వెన్నంటి ఒకముస్లిం యువతి గుర్రం మీద అనుసరించేది. కొఠాకి సరాయి ప్రాంతంలో రాణితోపాటుగా ఆమెకు తుపాకి గుండ్లు తగిలాయి. ఆమె రాణితోపాటుగా ఒకేసారి నేలకొరిగింది అని వివరించాడు.

ఆ విషయాన్నిDr. Surendra Nath Sen తన గ్రంథం Eighteen Fifty Seven లో వివరిస్తూ ఆంగ్లేయాధికారి రాబర్ట్‌ హెమిల్టన్‌ వివరణను ఉటంకించారు. ( '..The Rane was on Horse back, and close to her was the female (a Mohomaden) who seems never to have left her side on any occasion, these two were struck by bullets and fell ' ఆ యువతి ఎవరన్నది ఆ ఆంగ్లేయుడు పేర్కొనలేదు. భారత ప్రభుత్వం 1973లో ప్రచురించిన Who's who of Indian Martyrs, Vol. 3 లో మాత్రం ఝాన్సీ రాణితో పాటుగా పలు పోరాలలో పాల్గ్గొన్న

80