పుట:1857 ముస్లింలు.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

బేగం (హింది), డాక్టర్‌ సుధా త్యాగి, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1992, పేజి. 20) ప్రదమ స్వాతంత్య్ర సమరంలో బేగం హజరత్‌ మహల్‌ బాటన నడిచిన మహిళలను చరిత్ర పుటలు అక్కడక్కడా మనకు పరిచయం చేస్తాయి. ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ప్రముఖులు. ఆమె 1832లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బితూర్‌లో జన్మించారు. తండ్రి హసీనా ఖాన్‌. చిన్ననాటనే తల్లి హమీదాను కోల్పోయారు. అజీజున్‌ మంచి రూపశి. ప్రసిద్ధ నర్తకి ఉమరావ్‌జాన్‌ బృందంలో అజీజున్‌ చేరి మంచి నర్తకిగా ఖ్యాతిగాంచారు. నాట్యకళ మీద మంచి అభినివేశాన్ని సాధించి ఆ కళను ప్రదర్శిస్తూ అపారంగా ధనాన్ని ఆర్జించారు.

మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆమె ప్రబు భక్తి పరాయణురాలు. కాన్పూరు అధినత నానాసాహెబ్‌ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే ఆమె కూడ ఆయన పక్షాన యుద్ధరంగ ప్రవేశం చేశారు. అజీజున్‌ సమర్థవంతమైన నాయకత్వంలో మహిళా సైనిక దాళాలు పలు కార్యక్రమాల భారాన్నిస్వీకరించి నానా సాహెబ్‌ పోరాటానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆమె తన బలగంతో నగరంలోని ప్రతి ఇల్లూ తిరుగుతూ యుద్దభూమికి తరలి రాని యువకుల ఉద్దేశించి మీ లాంటి యువకుల్లో రక్తం చల్లబడిపోయింది. మీలో పౌరుషం చచ్చిపోయిందా? మీ రక్తం ప్రతీకార జ్వాలతో వేడెక్కుతుందా? లేదా? మన మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మన పై పెత్తనం చలాయిస్తున్నారు. దానిని మనం మౌనంగా భరిస్తున్నాం. మన వీరత్వం, సౌర్య పరాక్రమాలు ఏమైపోయాయి? అని ప్రశ్నిస్తూ యువకుల్లో రోషాగ్నిని ప్రజ్వరిల్ల చేశారు. (అజ్ఞాత వీర గాథలు, గోవిందాస్వరూప్‌ సింహాల్‌, భారత ప్రబుత్వ ప్రచురణలు, న్యూడిలీ, 1999, పేజి. 30-31)

అజీజున్‌ స్వయంగా రణరంగ ప్రవేశం చేసి శత్రుసైన్యాలను అత్యంత ధైర్య సాహసాలతో ఎదాుర్కొన్నారు. మరోవైపున సైనిక పటాలాలను, గూఢచారి దళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటుచేసి ఆంగ్లేయులతో నానాసాహెబ్‌ సాగించిన పోరుకు ఎంతగానో తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధభూమిలో గాయపడి శత్రువు చేత చిక్కారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి

76