పుట:1857 ముస్లింలు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహిళలు


Col. William తయారు చేసిన కాన్పూరు తిరుగుబాటుదారుల జాబితాలో అజీజున్‌ మొదటి స్థానంలో ఉన్నారు. (Encyclopaedia of Muslim Biography,Vol. I, Ed. by Narendra Kr . Singh, APH, New Delhi, 2001, P.585)

ఆ తరు వాత సాగిన విచారణలో ఆమెకు వ్యతిరేకంగా కాన్పూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి జానకీ ప్రసాద్‌ సాక్ష్యం చెబుతూ ఆమె ఎల్లప్పుడూ సైనికాధికారి దుస్తులలో ఉంటారు. నానా సాహెబ్‌ కోసం ఆమె మహిళా దాళాలు పనిచేశాయి. ఆమెకు పీష్వా సైనిక దాళాలతో కూడ ప్రత్యక్ష సంబంధాలున్నాయి. తిరుగుబాటు పతాకం ఎగరగానే ఆమె తిరుగుబాటు యోధులతో కలసి పోరుబాటన నడిచారు అని ఆంగ్లేయ సెనిక న్యాయస్థానంలో వివరించాడు.

ఈమేరకు ఆమె తిరుగుబాటు యోధులతో కలసి పనిచేశారని ఆమె సాహసోపేత చర్యలను ప్రత్యక్షంగా చూసిన బ్రిటిషు అధికారులు, పలువురు ప్రముఖ వ్యకులు, ఇతర అధికారులు సాక్ష్యం పలికారు. (Encyc lopaedia of Muslim Biography, Vol.I, page. 585)

ఈ విచారణలో భాగంగా బేగం అజీజున్‌ను ఉన్నత సైనికాధికారి General Havelock ఎduట హాజరు పర్చారు. ఆమె సాహసకృత్యాల గురించి విని ఉన్నఆ అధికారి, ఆమె రూపురేఖ లను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కనుక తన అపరాధాన్ని అంగీకరించి, క్షమాపణ వేడుకుంటే ఆరోణపలన్నీ రద్దుచేస్తానన్నాడు. ఆ ప్రతిపాదనలను బేగం అజీజున్‌ నిరాకరించారు. ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన ఆ అధికారి నీకేం కావాలి? అని ప్రశ్నించాడు. నాకు బ్రిటిష్‌ పాలన అంతం చూడాలనుంది, ('I want to see the end of the British rule ', - Encyc lopaedia of Muslim Biography, Vol.I, P.586), అని ఆమె నిర్బయంగా సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో ఆగ్రహంచిన General Have-

77