పుట:1857 ముస్లింలు.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిమహిళలు

రణరంగం నుండి తప్పుకోడానికి ఇష్టపడలేదు. చివరకు, సహచరుల బలవంతం మీద ఆంగ్లేయుల ముట్టడి నుండి తప్పించుకుని, తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధ రంగం నుండి నిష్క్రమించిన ఆమె బ్రిటిష్‌ తొత్తు అయినటువంటి నేపాల్‌ అధినేత జంగ్ బహదాూర్‌ తిరస్కారాన్ని కూడ లెక్క చేయకుండా నేపాల్‌ పర్వతాల్లోకి ప్రవశించారు.

1857 ముస్లింలు.pdf


ఈ విధంగా బేగం హజరత్‌ మహల్‌ అవధ్‌ రాజ్యంలో, ఆ రాజ్యం రాజధాని నగరం లక్నోలో రగిల్చిన పోరాటం 22 మాసాల పాటు పొగలుసెగలు కక్కుతూ బేగం నిష్క్రమణతో ముగిసింది.

నేపాల్‌ పర్వత ప్రాంతాలలో నానా సాహెబ్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా లాంటి యోధులతో కలసి బలగాలను స మీకరిస్తూ , మళ్ళీ పోరాటానికి సి ద్ధప డ సాగార . ఆ సమయంలో ఆమెకు 20 లక్షల భత్యం ఇవ్వగలమని, అందుకుగాను ఆమె లక్నోకు తిరిగి రావాలి. అవధ్‌ రాజ్యం మీద తనకుటుంబానికి గ ల అధికారాన్ని పూర్తిగా వదలు కోవాలని ఈస్ట్ ఇండి యా కం పెనీ ఉన్నతాధికారులు ఒక చిత్రకారుని బేగం జీనత్‌ మహల్‌ ద్వారా రాయబారం పంపారు. ('Begum Hazarath Mahal-Freedom Fighter Par Excellence , Nayeem Raza Radiance Views Weekly, 31 August.- 6 September. 2003, P. 26).

ఆ ప్రతిపాదానను, ఆంగ్లేయులు సమర్పిస్తామన్న భారీ నజరానాలను బేగం హజరత్‌ మహల్‌ నిక్కచ్చిగా తిరస్కరించారు. బ్రిటిషర్ల బానిసగా తమ గడ్డ మీద తాను అడుగు పెట్టేది లేదాన్నారు. మాతృభూమి విముక్తి తప్ప తనకు మరొకటి ఏమాత్రం సమ్మతం కాబోదని ప్రకటించిన బేగం హజరత్‌ మహల్‌ చివరి వరకు పలు కష్టాలను ఎదుర్కొంటూ 1874 ఏప్రిల్‌ 7న నేపాల్‌ అడవుల్లో సామాన్య మహిళగా కన్నుమూశారు. (అవథ్‌-కీ- 75