పుట:1857 ముస్లింలు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు

 ముమ్మరం చేశారు. ఈ అరెస్టులలో 14 సంవత్సరాల సయ్యద్‌ లాల్‌ అను యోధుడు కూడా ఉండటం విశేషం. ఈ యోధుడు 7 సంవత్సరాల కారాగార శిక్షకు గురయ్యారు. ఈ విధంగా గుంటూరు, కృష్ణా, గోదావరి మండలాల్లో ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ప్రభావం తీవ్రంగా కన్పించింది. (1857, యం.వి.ఆర్‌ శాస్త్రి, ఆంధ్రభూమి దినపత్రిక, 2007 జనవరి 14)

ఉత్తరాదికి తరలి వెళ్ళిన యువకులు

స్వస్థానంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొనటమే కాకుండా, ఉత్తర భారతంలో స్వదేశీయ యోధులు సాధిస్తున్న విజయాల గురించి విన్న రాయలసీమ యువకులు అక్కడికి కూడా వెళ్ళారు. రాయలసీమ ప్రాంతం నుండి పలువురు ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులతో కలసి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో పాల్గొనేందుకు ఉత్తర భారతావనికి వలస వెళ్లారని అప్పటి కడప మెజిస్ట్రేట్‌ మద్రాస్‌ గవర్నర్‌కు 1857 జూన్‌20న రాసిన లేఖలో పేర్కొన్నారు.

(కడపజిల్లా స్వాతంత్య్రోద్యమంలో కొన్ని ముఖ్యఘట్టాలు, డాక్టర్‌ యం. నజీర్‌ అహమద్‌, ప్రచురణ ః స్వతంత్ర భారత స్వర్ణోత్సవ సావనీర్‌, రాయలసీమలో స్వాతంత్య్రోద్యమం, స్వత్రంత్ర భారత స్వర్ణోత్సవ సావనీరు కమిటి, అనంతపురం, 1998, పేజి. 55 మరియు The Freedom Struggle in Andhra Pradesh (Andhra),Volumes I (1800-1905 AD), Govt. of AP, Hyderabad, 1997, P. 147)

ఈ విధంగా 1857నాటి పోరాటంలో బ్రిటీషర్ల విూద తిరగబడిన జనులు, సైనికులు అనేకులున్నారు. ఆ యోధులందరి పట్ల ఆంగ్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. ఆ వీరులందరి చరిత్రలు చాలా వరకు నమోదుకు నోచుకోకపోవటంతో ఆ సాహసోపేత సంఘటనల వివరాలు చరిత్రగర్భంలో కలసిపోయాయి.

1859 జనవరి నాటికి చల్లబడిన తిరుగుబాటు

పరాయి పాలకులకు వ్యతిరేకంగా బరహంపూర్‌, విూరట్‌ యోధుల ప్రేరణతో ఆరంభమైన పోరాటం అస్సాం, ఛోటా నాగపూర్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ, ఆగ్రా, కాన్పూరు, ఝాన్సీ, బెనారస్‌, లక్నో, పంజాబ్‌, సింధ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, హైదరాబాద్‌,