పుట:1857 ముస్లింలు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ప్రాంతాలను పూర్తిగా చుట్టేసింది. చివరకు వలస పాలకులను తమ గడ్డ విూద నుండి పూర్తిగా వెళ్ళగొట్టాలని దీక్ష వహించిన ప్రజలు, స్వదేశీ సైనికులు, స్వదేశీ పాలకులు ఏకమై సాగించిన పోరు 1859 జనవరి 21న పూర్తిగా బలహీనపడిపోయింది.

ఈ క్రమంలో చివరి యుద్ధం రాజస్థాన్‌లోని సీకర్‌ వద్ద జరిగింది. ఈ పోరాటంలో షెహజాదా ఫిరోజ్‌ షా, తాంతియా తోపే, నానా సాహెబ్‌ల నాయకత్వంలోని స్వదేశీ సైనికులు పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని కొందరు స్వదేశీపాలకుల నమ్మకద్రోహం వలన చివరిపోరులో స్వదేశీ యోధులు విజయం సాధించలేకపోయారు. బేగం హజరత్‌ మహల్‌, అజీముల్లా ఖాన్‌, నానా సాహెబ్‌, తాంతియా టోపే లాంటి యోధానుయోధులు ప్రత్యక్ష పోరాటం నుండి తప్పుకోవడంతో బ్రిటీషర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పోరాటం తరువాత అక్కడక్కడా తిరుగుబాటు యోధులు ఆంగ్లేయులను ధిక్కరిస్తూ వచ్చినా ఆ పోరాటాలు అంతగా ప్రాధాన్యత సంతరించుకోలేదు.

ఈ పోరాటంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీలో సైనికులుగా, సైన్యాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వదేశీ సిపాయీలు ప్రధానంగా పాల్గొన్నారు. ఆ కారణంగా కొందరు చరిత్రకారులు ఈ పోరాటాన్ని సిపాయీల తిరుగుబాటు అని పిలిచారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ నివేదికల ప్రకారంగా కంపెనీ సైన్యంలో 2లక్షల 35వేల 2వందల 24 మంది సైనికులు ఉండగా వీరిలో లక్షా 20వేల మంది స్వదేశీ పాలకులతో కలసి కంపెనీ బలగాలతో తలపడ్డారని తెలుస్తుంది.

భాతర దేశంలో అత్యధిక సంఖ్యలో సుశిక్షుతులైన సైనిక బలగాలను కలిగి ఉన్న వలస పాలకులను సువిశాల భాతర దేశంలో సుమారు రెండు సంవత్సరాల పాటు సాయుధంగా ఢీకొనడం విశేషాంశం. స్వదేశీ సైనికులు మాత్రమే కాకుండా ప్రజలు, స్వదేశీ పాలకులు, స్వదేశీ ప్రముఖులు పాల్గొనటం వలన ప్రపంచ విముక్తి పోరాట చరిత్రలో అగ్రస్థానం పొందిన ఈ పోరు సాధ్యమైంది. ప్రజలు, ప్రముఖులు అంతా కలసి ఏకోన్ముఖంగా కంపెనీ పాలన విూద తిరగబడ్డారు కనుక ఈ పోరాటాన్ని a national revolt అని కారల్‌ మార్క్స్‌ అభివర్ణించాడు.

తిరుగుబాటు కాదు స్వాతంత్య్ర సమరం

ఈ పోరాటంలో కేవలం సిపాయిలు మాత్రమే కాదు అన్ని వర్గాల-వర్ణాల