పుట:1857 ముస్లింలు.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ముస్లింలు

బయటపడటంతో బేగ్‌ను ఆయన సహచరులు ఖాజీ మున్‌దార్‌ అలీ, హుసైన్‌ బేగ్‌,షబిబ్‌ బేగ్‌, మీరా హుస్సేన్‌, సిలార్‌ ఖాన్‌, మీర్‌ లుబ్బా ఖాన్‌, మీర్‌ వజీర్‌ అలీ,గాలిబ్‌ బేగ్‌, ముస్తాబ్‌ సాహెబ్‌, ఖాద్‌ ముహమ్మద్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ దాదా సాహెబ్‌ తదితరులను అరెస్టు చేశారు. (The Freedom Struggle in Andhra Pradesh(Andhra), Volumes I, P. 156)

ఈ తిరుగుబాటును ప్రస్తావిస్తూ ఆగస్టు 22న రాజమండ్రిలోని అధికారి మద్రాసులోని ప్రభుత్వ ప్రధాన కార్యదార్శికి రాసిన లేఖలో భారీ కుట్రను మొగ్గలోనే తుంచగలిగామని చెప్పుకున్నాడు. ఈ తిరుగుబాటు కవలం రాజమండ్రి వరకు పరిమితం

1857 ముస్లింలు.pdf

వీరోచిత పోరు తరువాత తిరుగుబాటు యోధుల నుండి ఆంగ్లేయుల పరమైన అవధ్‌ రాజధాని లక్నో నగరం

కాలేదని, మచిలీపట్నం, గుంటూరు జిల్లాలను కూడ కలుపుకుని ప్రజలను రెచ్చగొట్టి ఒకేసారి తెలవారి మీదా తిరుగబడేందుకు పెద్ద వ్యూహం పన్నారని, ముసల్మాన్లు ఇందులోప్రధాన పాత్ర వహించారని ఆ అధికారి వివరించాడు. (The Freedom Strugglein Andhra Pradesh (Andhra), Volumes I, PP. 60,156-157)

ఈ వార్తతో గుండెలదిరిన అధికారులు ముప్పు కొద్దిలో తప్పి పోయిందని భావిస్తూఅప్రమత్తులై ఉండాల్సింది గా ఇతర ప్రాంతాల అధికారులకు హుాటాహుటిన వర్తమానం పంపారు. అనుమానితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ దాడులు చేసి అరెస్టులను 65