పుట:1857 ముస్లింలు.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


పలు ప్రాంతాలలో దుండగులు ఉంచిన బాంబులు పేలకపోవడం వలన అవి నేరస్థుల ఆచూకిని పట్టిచ్చాయన్న విషయాన్నికార్టూన్‌ ద్వారా పాఠకులకు తెలపాలని భావించిన ప్రముఖ దినపత్రిక వార్త 2007 ఆగస్టు 28న నాటి సంచికలో ఒక కార్టూను ప్రచురించింది. ఆ కార్టూనులో గల మూడు చిత్రాలు టోపీ ధరించి గడ్డం గల ప్రతి ముస్లిం ఒక తీవ్రవాది' అను భావన పాఠకులలో కలిగించేలా ఉంది. సాంప్రదాయకంగా గడ్డం,టోపి ధరించిన ముస్లింలంతా తీవ్రవాదుల అను భావన ముస్లిమేతరలలో కలగడనికి, ముస్లిం జనసముదాయాలను ఆత్మన్యూనతా భావనకు గురిచేయడానికి ఈ కార్టూను దొహదాపడేలాగుంది.

ఈ విషయం మీదపలువురు ముస్లిం మేధావులు స్పందిస్తూ ' వార్త ' అధినేతకు తమ నిరసన తెలిపారు. ఆ నిరసన వెల్లువను గమనించిన పత్రికాయాజమాన్యం తక్షణమే స్పందిస్తూ , 2007 ఆగస్టు 29 సంచికలో 'గమనిక' అను శీర్షిక క్రింద, 'ఈ నెల 28వ తేది మంగళవారం నాటి 'వార్త' మొదటి ి పేజీలో, హైదారాబాద్‌ జంట పేలుళ్ళకు సంబంధించిన వార్తతో పాటు వేసిన కార్టూన్, పేలుళ్ళ సందర్బ పైనే తప్ప యథాతదంగా ఏ సామాజిక వర్గామన్ని ఉద్దేశించింది కాదని గమనించగలరు. అది మా విధానం కూడా కాదు. ఏది ఏమైనా అటువంటి కార్టూన్‌ వేసి ఉండవలసింది కాదని భావిస్తున్నాం వేసినందుకు క్షంతవ్యులం.-ఎడిటర్‌ ' అని ప్రకటించింది. మనోవేదనకుగురైన వ్యక్తులకు సర్దిచెప్పేందుకు వెలువరించిన ఈ ప్రకటన ఎలా ఉన్నా పత్రికారంగంలోని వ్యక్తుల మస్తిష్కాల్లో ముస్లింల పట్ల ఉన్నటువంటి దోషపూరిత-ద్వేషపూరిత భావనలకు ఈ కార్టూన్‌ అద్దం పడుతుంది.

ఈ విధగా ఆంగ్లేయుల పాలనా కాలం నుండి పునాదులు వేయబడిన ముస్లిం వ్యతిరేకత, ఆ పునాదుల మీద నిర్మించబడిన చరిత్ర, ఆ చరిత్రను మరింత వక్రీకరించి రాజ్యాధికారాన్ని చేపట్టాలన్న తృష్ణతో మతోన్మాద స్వార్ధపర రాజకీయ శక్తులు ముస్లింలకు వ్యతిరేకంగా సాగిస్తున్న దుష్ప్రచారం, ముస్లింల పేరుతో మార్గం తప్పిన ఏ కొందరో సాగిస్తున్న అమానుష చర్యల నేపధ్యంలో ముస్లింలు భారతీయ ఉమ్మడి భాగస్వామ్యానికి దూరంగా ఉంచబడుతున్నారు. అన్నిరంగాలలో ఆవలకు నెట్టివేయబడుతున్నారు.

ముస్లిం నియతృత్వం భూమికగా వెల్లువెత్తిన ఇరత అంశాలు, ఆ అంశాల విస్తృతి ఫలితంగా ముస్లిం-ముస్లిమేతర ప్రజల మధ్య ఏర్పడుతున్న మానసిక ఎడం

285