పుట:1857 ముస్లింలు.pdf/289

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ముస్లిం యోధుల త్యాగాల విస్మరణకు ప్రధాన కారణమమౌతుంది. ముస్లిం-ముస్లిమేతర సమూహాల మధ్య ఏర్పడిన మానసిక దూరం లాంటి నకారాత్మక అంశాలు ముస్లిం యోధుల పట్లగానీ, ముస్లింల పట్లగానీ వ్యక్తం అవుతున్న నిర్లక్ష్యం, విచక్షణలకు అసంఖ్యాకులైన బహుళ సముదాయాల సహజ సమ్మతికి తొడ్పడుతున్నాయి. ఈ సమ్మతి కారణంగా మాతృభూమి విముక్తి పోరాటంలో అసమాన త్యాగాల చరిత్రగల ముస్లిం యోధులను ఎందుకు విస్మరిస్తున్నారని, మరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అల్పసంఖ్యాక ముస్లిం జనసముదాయాలు సూటిగా ఎవ్వర్నీ ప్రశ్నించలేకపోతున్నాయి. అసంఖ్యాకులైన ముస్లింమేతర సోదరులలో గూడుకట్టుక పోయిన ముస్లిం వ్యతిరేకతకు సంబంధించిన మానసిక భావన ఈ వివక్ష గురించి ఆలోచించనివ్వడంలేదు. ఈ విస్మరణ-వివక్ష అతి సహజమైన అంశంగా సాగిపోతున్నందున మరెవ్వ రినీ ప్రశ్నించనివ్వడం లేదు. ఆ కారణంగా ముస్లింమేతర జనసముదాయాలు అనివార్యంగా మౌనం వహిస్తున్నాయి. అలనాటి ముస్లిం యోధులు సాహసోపేత వీర గాధలు విస్మరణకు గురవుతున్నాయి.

How unfortunate in this country that the life story of sluch heroes has to be collected from the pagers of the biased history written by the foreigners. Of the Sepoy war period we can specify the names ot many brave warriors, who if they had been born in Europe, would have been immortalised in the pages of history, in the lyrice verses of the poets and on marble statues and lofty monuments. - Rabindra Nath Tagore.

286