పుట:1857 ముస్లింలు.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ముస్లిం మహిళలు ఆయా ప్రాంతాలను బట్టి వివిధ తీరులలో పర్దాను పాటిస్తున్న విషయం ఆమె గమనించలేదు.

ఆ కారణంగా ఆమె ప్రవంచిన మాటల పర్యవసానం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముస్లిం ప్రభువుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టగల తీరులో చరిత్రకు సంబంధించిన వ్యాఖ్యలు యుధాలాపంగా చేశారు. ఈ విధమ్గా ప్రముఖ వ్యక్తి నోటిగుండా వెలువడిన ఆ వాక్యాలు జన బాహుళ్యంలో ప్రదానంగా పసిహృదయాలలో, ఎటువంటి అసత్యాన్ని నిర్ధుష్ట సత్యంగా స్థిరం చేస్తుందో ఆ మాటలంటున్నప్పుడు ప్రతిభా పాటిల్‌ బహుశా గ్రహించి ఉండరు. ఈ విధమైన వ్యాఖ్యలు చిన్నవిగా కన్పించినా ప్రజలలో బలమైన ముస్లిం వ్యతిరేక ముద్రవేస్తాయి.

చారిత్రక అవాస్తవాల ప్రచారంలో ప్రముఖులు మాత్రమే కాదు పత్రికలు కూడ తెలిసీి-తెలియక భాగం పంచుకుంటున్నాయి. 2005 మే22నాటి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ' మధురం..మధురం ఈ సమయం' శీర్షికన మామిడిపళ్ళ మీద ఓ వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం మధ్యభాగంలో 'భాతర దేశాన్ని విపరీతంగా ద్వేషించిన గ్రేట్ మొగల్స్‌ సైతం ఈ పండ్ల ప్రాశస్త్యాన్ని కాదనలేక పోయారు, ' అని ఒక వాక్యం అసందర్భంగా వచ్చి కూర్చుంది.

ఈ వాక్యంలోని సత్యాసత్యాలను, సందర్భాన్ని ప్రశ్నిస్తూ రాయలం ప్రాంతానికి చెందిన యండి. మగ్దూమ్‌ అలీ 2005 జూన్‌ 5నాటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రశ్నించగా ' అది రచయిత రాసింది కాదు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం ' అని సంపాదకులు సమాధానమిచ్చి సరిపెట్టుకున్నారు. భాతర దేశాన్ని విపరీతంగా ద్వేషించిన గ్రేట్ మొగల్స్‌ సైతం ఈ పండ్ల ప్రాశస్త్యాన్ని కాదానలేక పోయారు అను ఈ వాక్యాన్ని చదివిన వారంతా ఎడిటర్‌ రాసిన 'అది రచయిత రాసింది కాదు. జరిగిన పోరపాటుకు చింతిస్తున్నాం' అను వాక్యాన్ని చదవకపోవచ్చు. ఆ కారణంగా సాధారణ పాఠకులలో మొగల్‌ చక్రవర్తులు భారత దేశాన్ని విపరీతంగా ద్వేషించారు కాబోలు అనుకోవడం సహజం. ఈ భావన ముస్లింల పట్ల ముస్లిమేతర సోదరులలో మానసిక వ్యతిరేకత చోటుచేసుకోడానికి తప్పకుండ దోహదపడుతుంది.

మన రాష్ట్ర రాజధాని హెదారాబాద్‌లో ఆగష్టు 25, 2007 లుంబినివనం, గోకుల్‌ చాట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్ళ అమానుషకాండ నేపధ్యంలో నగరంలోని

284