పుట:1857 ముస్లింలు.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


ఎత్తుకపోవడం యుద్ధనీతిలో భాగమని భావించటం ఇక్కడ కూడా సర్వసాధారణమైన సంఘటనలుగా సాగాయి. చర్రిత వెల్లడి చేస్తూన్న ఈ పచ్చినిజాలను పూర్తిగా విస్మరించి, బయట నుండి వచ్చిన వారు మాత్రమే యుద్ధాలు చేశారని, వారంతా రాజ్యవిస్తరణ కాంక్షాపరులని, ఆక్రమణదారులని, విధ్వంసం సృష్టించారని, సంపదను కొల్లగొట్టారన్న అతి తీవ్రమైన భావజాలాన్ని ప్రచారం చేశారు. ఇండియాలో హిందూ రాజుల మధ్య, ముస్లిం రాజుల మధ్య, హిందూ-ముస్లిం రాజుల మధ్య ముమ్మరంగా జరిగిన యుద్ధాల విషాద వాస్తవాలను మరచి ముస్లిం ప్రభువులకు మాత్రమే పరాయితనం అంటగట్టి, వారిని దోపిడిదారులుగా, విధ్వంసకులుగా చిత్రించడం, ప్రచారం చేయడం, సామాన్య ముస్లిం ప్రజానీకాన్ని దానికి బాధ్యుల్ని చేయడం హిందూ-ముసిం ప్రజల మధ్య అంతులేని మానసిక ఎడం ఏర్పడడానికి ప్రబల కారణమయ్యింది.

ఈ విధంగా ఆంగ్లేయులు నమోదు చేసిన చరిత్ర, ఆ చరిత్ర ఆధారంగా స్వదేశీ చరిత్రకారులు రాసిన చరిత్ర, ఆ చారిత్రక గ్రంథాలలోని సమాచారం ఆధారంగా మధ్యయుగాల నాటి ముస్లింల పాలనను నియంతృత్వ పాలనగా ముస్లిం పాలకులను నియంతలుగా, క్రూరులుగా, హిందూ మత వ్యతిరేకులుగా అభివర్ణించడం ప్రజలను బాగా ప్రభావితం చేసింది. ఆ తరువాతి కాలంలో పాలకులు పాలితుల మధ్య తేడాను ఏమాత్రం గమనించ కుండా పాలకుల పాపాలను పాలితులకు అంటగడ్తూ, ఆ పాపభారాన్ని పాలితుల మీద మోపుతూ పాలకులను-పాలితులను కూడ సమదృష్టితో చూడడం వలన ఈ గడ్డ బిడ్డలైన సామాన్య ముస్లిం జనసముదాయాలను కూడా విదేశీయులుగా, పరాయివారుగా పరిగణంచగల దృఢమైన మానసిక పరిసితి ముస్లిమేతర ప్రజలలో ఏర్పడింది.

ఈ దక్పధం నుండే ముస్లిం యోధుల మీద దృష్టిసారిస్తున్నచరిత్రకారులకు, రచయితలు-కవులకు భారత దేశ విముక్తికోసం పోరాటాలు చేసిన ముస్లింలలో మాతృభూమి పట్ల గౌరవాభిమానాలు ఏమాత్రం కన్పించడం లేదు. ఈ యోధులు చేసిన పోరాటాలలో వారికి ప్రదానంగా మతభక్తి-మతపిచ్చి మాత్రవుే కన్పిసుంది. భారతదశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పట్టిపీడించి, ఇక్కడి సంపదనంతా తమ దేశానికి తరలించిన ఆంగ్లేయలు మాత్రం ముస్లిం యోధులు ఆరంభించిన పోరాటాలు తమను తమ మాతృభూమి నుండి తరిమి వేయడానికి మాత్రమేనని స్పష్టంగా అంగీకరిస్తున్నా,

275