పుట:1857 ముస్లింలు.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ముస్లిం యోధులు మాతృభూమి పట్ల అంతులేని ప్రేమాభిమానాలు గల దేశభక్తులుగా వారు కీర్తిస్తున్నా, జాతీయవాదం పేరుతో ముస్లిం వ్యతిరేకతను వెదజల్లుతున్న కొంత మంది మేధావులకు మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొన్న ముస్లింలు స్వేచ్ఛా- స్వాతంత్య్రాల కోసం కాకుండా కేవలం మతం కోసం చేసన పోరాటంలో పాల్గొన్నవారుగా కన్పించటం విషాదం.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన మౌల్వీ అహమ్మదుల్లా షా ఫైజాబాది గురించి 1857 నాటి పోరాలలో పాల్గొన్న బ్రిటిష్‌ సైనికాధికారి General Holems తన The Sepoy War అను గ్రంథంలో గురించి రాస్తూ,‘..The Moulvi was a true patriot. He had not stained his sword with assassination. He had connived at no murders; he has fought manfully, honorably and stubbornly in the battle field against the stranger who had seized his country, and his memory is entitled to the respect of the brave and truehearted of all nations...’ (Muslims In India, S.Abul Hasan Ali Nadvi,1980,P. 107) అన్నాడు.

మౌల్వీ అహమ్మదుల్లా షాతో పలు పోరాటాలు చేసిన కల్నల్‌ జి.ఎ.మాల్సన్‌,(G.B. Malleson) మౌల్వీ చర్యలను పూర్తిగా సమర్థిస్తూ '..తన దేశాన్ని ఆక్రమించుకుని ధ్వంసం చేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా కుట్రపన్ని, యుధం చేసి, స్వాతంత్య్రం సంపాదించు కోవడం దేశభక్తి అయితే తప్పకుండా మౌల్వీ గొప్ప దేశభక్తుడు...ఆయన అమాయకుల ప్రాణాలు తీయలేదు....తన దేశాన్ని వశంచేసుకున్న విదేశీయుల మీద గౌరవప్రదమైన యుద్ధం చేశాడు. వీరుడుగా, నీతిమంతుడుగా గుర్తించబడిన ఆయన అన్ని దేశాలు గౌరవించదగిన యోధుడు..', అని ప్రశంసించాడు.

మౌల్వీ తనతో కలసి వచ్చే స్వదేశీపాలకులను ఏకం చేసే ప్రయత్నాలలో భాగంగా షాజహాన్‌పూర్‌ జిల్లాలోని పోవెన్‌ (POWAIN) రాజు జగన్నాధ సింహా›తో చర్చ లు జరిపేందుకు వెళ్ళిన సందర్బంగా ఆంగ్లేయుల ఎంగిలి మెతుకులకు ఆశపడిన పోవెన్‌ రాజు సోదరుడు విశ్వాసఘాతుకానికి పాల్పడి మొఎల్వీ మీద కాల్పులు జరిపిన కారణంగా ఆయన ప్రాణాలు కోల్పొయారు. ఈ విషయాన్ని వి.డి.సావార్కర్‌ తన 1857 స్వరాజ్య సంగ్రామం గ్రంథంలో వివరిస్తూ రాజా ప్రక్క నే ఉన్న అతడి సోదరుడు మౌల్వీ పై గురిచూసి కాల్పులు జరిపాడు. ఆ దుర్మార్గుని హస్తాలలో మౌల్వీ హతుడైపోయాడు. ఆ పిరికిపందలు...మౌల్వీ శిరస్సు

276